Telugu News » Blog » కేసీఆర్ కు షాక్..తెలంగాణలో చంద్రబాబు భారీ బహిరంగ సభ!

కేసీఆర్ కు షాక్..తెలంగాణలో చంద్రబాబు భారీ బహిరంగ సభ!

by Bunty
Ads

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫోకస్ చేసినట్లు సమాచారం అందుతోంది. బలంగా ఉన్న జిల్లాల్లో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు చంద్రబాబు నాయుడు స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే తెలంగాణలో వరుసగా బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు. ఇక తాజాగా ఖమ్మంలో ఈనెల 21న తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ విజయవంతం చేయాలని తెలంగాణ టిడిపి అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, టిడిపి తెలంగాణ వ్యవహారాల సమన్వయకర్త కంభంపాటి రామ్మోహన్ రావు పిలుపునిచ్చారు.

Advertisement

ఎన్టీఆర్ భవన్ లో విలేకరుల సమావేశంలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ, 21న ఖమ్మంలో తెలుగుదేశం పార్టీ బహిరంగ సభ సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, యావత్ ఖమ్మంతోపాటు అన్ని జిల్లాల నుంచి టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు రావడం జరుగుతుందని తెలిపారు. ఈ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం హైదరాబాదులోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి మధ్యాహ్నం కి ఖమ్మం చేరుకుంటారు అన్నారు. ఈ మార్గమధ్యంలో అడుగడుగునా ఎన్టీఆర్, అంబేద్కర్ విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు. అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తారు అని పేర్కొన్నారు.

Advertisement

Advertisement

తెలంగాణ టిడిపిలో యువతరానికి పెద్దపీట వేస్తున్నామని, కొత్త వారి చేరికలు ఉంటాయని, ఖమ్మం సభ తర్వాత నిజామాబాద్, మహబూబాబాద్, వరంగల్ ఇతర ప్రాంతాల్లో కూడా బహిరంగ సభలు ఉంటాయని, ఈ సమావేశాల తర్వాత గతంలో సింహ గర్జన సభ ఎలా జరిగిందో దానికి మించిన సభ హైదరాబాదులో ఉంటుందని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. తరువాత కంభంపాటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ, బడుగు బలహీనవర్గాల ఊపిరి తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం అని ప్రతి పల్లెలో, పట్టణంలో, నగరాల్లో మూలమూలాన టిడిపి చేసిన అభివృద్ధి కనిపిస్తుందని తెలిపారు. అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు అని, ఆనాడు ఐటికి వేసిన విత్తనం ఇప్పుడు మహావృక్షంగా మారిందని, నిన్న ఐఎస్ బి లో కూడా అదే చూశామన్నారు. ఆనాడు చంద్రబాబు సైబరాబాద్ నగరాన్ని నిర్మించి, జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేశారని పేర్కొన్నారు.

You may also like