నందమూరి తారకరత్న ఇటీవల గుండెపోటుతో రీసెంట్ గా కన్నుమూసిన సంగతి తెలిసిందే. లోకేష్ తో పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న సడెన్ గా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయారు. ఆ తరవాత చాలా రోజుల పాటూ ఆయన ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి కన్నుమూశారు. కాగా తారకరత్న గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన నాటి నుండి ఆయన వెంట బాలయ్య ఉంటూ దగ్గరుండి ఆరోగ్యపరిస్థితిపై ఆరాతీస్తూ కుటుంబానికి అండగా నిలిచిన సంగతి తెలిసిందే.
Advertisement
ALSO READ : భూమా మౌనిక వీపుపై సీక్రెట్ టాటూ… మనోజ్ ఆగ్రహం ?
కాగా తాజాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి ఓ ఎమోషనల్ పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. మనం సొంత కుటుంబంగా పిలిచే ఏకైక వ్యక్తి బాలయ్య అంటూ అలేఖ్యరెడ్డి పేర్కొన్నారు. కష్టసుఖాలలో చివరవరకూ ఒక కొండలా అండగా నిలిచిన వ్యక్తి ఆననేనని అన్నారు. ఒక తండ్రిలా ఆస్పత్రికి తీసుకువెళ్లడం దగ్గరనుండి..నీ పక్కనే కూర్చుని తల్లిలా పాటలు పాడారని అన్నారు.
Advertisement
సిల్లీ జోకులు వేసి నువ్వు రియాక్ట్ కావాలని ప్రయత్నించడం…ఎవ్వరూ చూడనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు కన్నీళ్లు పెట్టుకోవడం..ఆయన మనతోనే ఉన్నారు …కానీ నువ్వు తొందరగా వెళ్లిపోయావ్ ఓబు..మిస్ యూ సో మచ్ అంటూ అలేఖ్యరెడ్డి తన పోస్ట్ లో పేర్కొన్నారు.
అంతే కాకుండా ప్రస్తుతం నెట్టింట తారకరత్న మరియు ఆయన పిల్లలను బాలయ్య ఎత్తుకున్న ఫోటోను అలేఖ్యరెడ్డి షేర్ చేశారు. ఆ ఫోటోను ఎడిట్ చేసిన వారికి అలేఖ్యరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఇక అలేఖ్య రెడ్డి షేర్ చేసిన ఫోటోలో బాలయ్య తారకరత్న పిల్లలను దగ్గరకు తీసుకోగా ఆయన పక్కన తారకరత్న కూర్చుకుని ఉన్నారు. అలేఖ్యరెడ్డి పోస్ట్ పై తారకరత్న అభిమానులు సైతం ఎమోషనల్ అవుతున్నారు.
Advertisement
ALSO READ : టాలీవుడ్ లో మరో బంపర్ కొట్టేసిన జాన్వీ కపూర్ !