Telugu News » Blog » టాలీవుడ్ లో మరో బంపర్ కొట్టేసిన జాన్వీ కపూర్ !

టాలీవుడ్ లో మరో బంపర్ కొట్టేసిన జాన్వీ కపూర్ !

by Bunty
Ads

మెగాస్టార్ చిరంజీవి నటవరసత్వాన్ని అంది పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు రామ్ చరణ్. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి గుర్తింపు సాధించాడు. అయితే, ఈ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ఆర్ ఆర్ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

READ ALSO : కూతురిని హెలికాప్టర్ లో అత్తారింటికి సాగనంపిన తండ్రి..వీడియో వైరల్ !

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ తోనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. అలాగే ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో కూడా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. మొన్న ఆ మధ్య బుచ్చిబాబు సినిమా గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు కూడా. ఉప్పెన సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బుచ్చిబాబు తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ తోను మరో లవ్ స్టోరీ చేస్తున్నాడని టాక్ వినిపిస్తోంది. శంకర్ సినిమా పూర్తి అయిన తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది.

READ ALSO : Naveen Case: దొరికే ఛాన్స్ లేదని అనుకున్నాం… నిహారిక సంచలన వ్యాఖ్యలు!

Ram Charan & Janhvi Kapoor To Star In Chiranjeevi & Sridevi Starrer Jagadeka Veerudu Athiloka Sundari's Sequel? Here's What The Producer Has To Say

ఇది ఇలా ఉంటే, ఇప్పుడు బుచ్చిబాబు మరియు చరణ్‌ సినిమాకు సంబంధించిన ఒక వార్త ఫిలిం సర్కిల్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో చరణ్ కు జోడిగా అందాల భామ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ నటిస్తుందని అంటున్నారు. జాన్వీ కపూర్ బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. జాన్వీ కపూర్ ఎన్టీఆర్ 30 సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. చరణ్‌ సినిమాలో ఆమెను ఎంపిక చేశారని టాక్‌.

Advertisement

READ ALSO : బాహుబ‌లి సినిమాలో త‌మ‌న్నా రోల్… మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్‌..!