Home » పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

by Anji
Ad

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి ప్రభంజనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ పుష్ప మూవీలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. అదేవిధంగా ఈ మూవీలో ఐటమ్ సాంగ్ లో సమంత కనిపించిన విషయం తెలిసిందే. అనసూయ కూడా పుష్ప మూవీలో కీలక పాత్రలో నటించారు.

Advertisement

ముఖ్యంగా పుష్ప సినిమాలో సునిల్, అనసూయ భార్యభర్తలుగా కనిపించారు. ప్రస్తుతం పుష్ప 2 మూవీ షూటింగ్ దశలో ఉంది. ఈ నేపథ్యంలో పుష్ప 2 నుంచి రకరకాల రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా మరో క్రేజీ న్యూస్ అందరినీ ఆశ్చర్యపరుస్తుందనే చెప్పాలి. పుష్ప2లో తమిళ స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడట. ఈ తరుణంలో ఇప్పటికే హీరో సూర్యను దర్శకుు సుకుమార్ కలిశారట. ఆ పాత్ర చేసేందుకు సూర్య కూడా సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.

Advertisement

దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. ఇదిలా ఉండగా.. పుష్ప2లో హీరోయిన్ శ్రీలీల ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్టు గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా త్వరలోనే రావాల్సి ఉంది. వాస్తవానికీ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియడం లేదు. పుష్ఫ 2 లో భాగంగా మూవీని ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ లో విడుదల చేయనున్నారు. పుష్ప మూవీ కూడా డిసెంబర్ లోనే విడుదలై మంచి సక్సెస్ సాధించింది. పుష్ఫ 2 మూవీ డిసెంబర్ లో విడుదలై.. మంచి సక్సెస్ సాధిస్తుందా లేదా అనేది వేచి చూడాలి. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు:

పవన్ కళ్యాణ్ ‘BRO’ మూవీకి ఫస్ట్ అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?

 ‘బేబీ’ మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?

 టీడీపీలోకి మంచు మనోజ్? వచ్చే ఎన్నికల్లో అక్కడ నుంచే పోటీ !

Visitors Are Also Reading