Home » ‘బేబీ’ మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?

‘బేబీ’ మూవీలో హీరోయిన్‌‌కు ఫ్రెండ్‌గా నటించిన ఈ చిన్నది ఎవరో తెలుసా.?

by Bunty
Ad

ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి కోట్లలో కలెక్షన్లు రాబట్టిన సినిమా ‘బేబీ’. ఈ సినిమాలో వైష్ణవి, విరాజ్, ఆనంద్ దేవరకొండ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ సినిమా కాన్సెప్ట్ తో కోట్లాదిమంది ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవికి ఫ్రెండ్ క్యారెక్టర్ లో నటించిన అమ్మాయి కూడా చాలా అద్భుతంగా నటించింది.

Advertisement

ఆ అమ్మాయి ఎవరు అని సోషల్ మీడియాలో తెగ చర్చలు జరుగుతున్నాయి. ఆ అమ్మాయి పేరు కుసుమ. ఈ సినిమాలో హీరోయిన్ వైష్ణవి ప్రవర్తన నచ్చక సెకండ్ హాఫ్ లో హీరోయిన్ కు దూరంగా ఉంటుంది. ఈ సినిమాలో వైష్ణవితో పాటు కుసుమ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా ప్రేక్షకులను సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా, మోడల్ గా తన కెరీర్ ను ప్రారంభించింది.

Advertisement

ఇప్పుడు ‘బేబీ’ సినిమాతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. డాన్స్ వీడియోలు, హాట్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటుంది. ఈ అమ్మడుకు ఇదే మొదటి సినిమా అయినప్పటికీ చాలా అద్భుతంగా నటించింది. ఈ సినిమాతో కుసుమాకు వరుస సినిమాలు క్యూ కట్టనున్నాయి. ఇక రాబోయే సినిమాలో ఈ అమ్మడు హీరోయిన్గా నటించనుందేమో చూడాలి.

ఇవి కూడా చదవండి

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

Visitors Are Also Reading