Home » ఆరోగ్యానికి పసుపు మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ నష్టాలు తప్పవు..!

ఆరోగ్యానికి పసుపు మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా..? ఈ నష్టాలు తప్పవు..!

by Sravya
Ad

పసుపు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఆయుర్వేద గుణాలు కూడా ఉంటాయి. పసుపు వలన ఆరోగ్యానికి ఎన్నో లాభాలు వుంటాయని చాలామంది ఎక్కువగా పసుపు ని వాడుతూ ఉంటారు. పసుపును తీసుకుంటే జ్వరం, అధిక కొలెస్ట్రాల్ సమస్య, లివర్ సమస్య, దురదలు వంటి బాధలు ఏమీ కూడా ఉండవు. వీటన్నిటికీ మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది పసుపు. కానీ అతిగా వాడడం వలన సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎక్కువ మోతదులో పసుపును తీసుకోవడం వలన ఎలాంటి సమస్యలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Advertisement

పసుపుని ఎక్కువ తీసుకుంటే ఉదర సంబంధిత సమస్యలతో పాటగా తల తిరగడం, అతిసారం, వికారం వంటి సమస్యలు కూడా కలుగుతాయి. అధికంగా తీసుకుంటే, కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. పసుపు ని ఎక్కువగా వాడితే నాడి వ్యవస్థకి కూడా అస్సలు మంచిది కాదు. ఇబ్బందులు ఎదురవుతాయి. పసుపును తీసుకునేటప్పుడు అధిక మోతాదులో తీసుకోకుండా ఉండటం మంచిది. లేదంటే అనవసరంగా ఇటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి. లిమిట్ గా పసుపుని తీసుకుంటే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. అధ్యయనాల ప్రకారం చూసుకున్నట్లయితే రోజుకి 500 నుండి 2000 మిల్లీగ్రాముల వరకు పసుపు తీసుకోవచ్చు. దీనికి మించి తీసుకుంటే నష్టాలు కలుగుతాయి. సమస్యల్ని ఎదుర్కోవాలి.

Also read:

Visitors Are Also Reading