Ad
సాధారణంగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు చాలామంది జ్ఞాపకశక్తి సమస్యతో బాధపడుతుంటారు. జ్ఞాపకశక్తి సమస్యను పారదోలడానికి ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల ఎంతో ఉపయోగం ఉంది. ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా చలికాలంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్లూ బెర్రీ ఒక రకమైన పండు. ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఈ పండు జాతికి చెందిన చాలా రకాల పండ్లు ఉన్నాయి.
ఉదాహారణకి స్ట్రాబెరీలు, బ్లూ బెర్రీస్, బెర్రీలు, మల్బరీ లాంటివి. బ్లూ బెర్రీస్ లో అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల శరీరంలో ఎక్కడైనా వాపు, ఒత్తిడిని కూడా ఇవి తగ్గిస్తాయి. పసుపులో కూడా జ్ఞాపక శక్తిని పెంచే ఔషధాలు ఎన్నో ఉంటాయి. ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో పసుపును వేసుకోవడం వల్ల ఎంతో మంచిది. అయితే పసుపు జ్ఞాపకశక్తి నే కాకుండా చర్మ సంబంధిత వ్యాధులను కూడా రాకుండా చేస్తుంది.
అదేవిధంగా బాదం పాలను కూడా తాగవచ్చు. జ్ఞాపక శక్తి వృద్ధి చెందాలంటే ఆహారంలో కోడిగుడ్డు, ఒక గ్లాస్ బాదం పాలను తీసుకోవాలి. కాలీఫ్లవర్ చలికాలంలో మార్కెట్ లో బాగా ఎక్కువగా లభిస్తుంది. ప్రతిరోజు కాకపోయినా వారంలో రెండు మూడు రోజులు కాలీఫ్లవర్ తినడం వల్ల జ్ఞాపకశక్తి బాగా పెరుగుతుంది అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కాలీఫ్లవర్ లో మెదడుకి శక్తిని అందించే యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ కె విటమిన్ బి కాంప్లెక్స్ లు ఉంటాయి. గుమ్మడి గింజలు కూడా జ్ఞాపక శక్తిని మెరుగుపరచడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్ వంటి అనేక రకాల యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుమ్మడి గింజల్లో ఉండే సూక్ష్మపోషకాలు మెదడు ఆరోగ్యంగా పని చేయడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతిరోజు ఆహారంలో ఈ ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవడం ఉత్తమం.
Advertisement