Home » రవితేజ సినిమాలో ఆ బాలీవుడ్ హీరోయిన్..?

రవితేజ సినిమాలో ఆ బాలీవుడ్ హీరోయిన్..?

by Azhar
Ad

మాస్ మహారాజ రవితేజ ప్రస్తుతం తెలుగులోనే బిజీగా ఉన్న హీరో అంటే అందరూ ఒప్పుకుంటారు. ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలు అనేవి రిలీజ్ చేసిన రవితేజకు అవి అనుకున్న ఫలితం అయితే ఇవ్వలేదు. అయిన కూడా స్పీడ్ ఏ మాత్రం తగ్గకుండా వరుస సినిమాలు అనేవి చేస్తున్నాడు. ఇప్పటికే తెలుగులో అందరి కంటే ఎక్కువగా ఆరడజను సినిమాలు కమిట్ అయ్యి ఉన్నాడు రవితేజ.

Advertisement

అందులో ప్రస్తుతం రవితేజ మూడు సినిమాలు సెట్స్ పైన నడిపిస్తున్నాడు. ఇక మిగిలిన సినిమాల ఇంకా షూటింగ్ అనేది ప్రారంభం కాలేదు. అయితే రవితేజ కమిట్ అయిన సినిమాలలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో చేసే సినిమా కూడా ఉంది. ఇక ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమాలోనే రవితేజ కోసం బాలీవుడ్ హీరోయిన్ ను తెస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఆమె ఎవరో కాదు.. తాప్సీ పన్ను.

Advertisement

తాప్సీ పన్ను… తెలుగులోనే ఎంట్రీ ఇచ్చిన విషయం అందరికి తెలుసు. ఆ తర్వాత ఇక్కడ సూపర్ హిట్ సినిమాలో చేసి… బాలీవుడ్ లో అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా మొదట్లో వరుస హిట్స్ అందుకొని బాలీవుడ్ హీరోయిన్ అయ్యిపోయింది తాప్సీ పన్ను. కానీ ఇప్పుడు ఆమె ప్లాప్స్ లో ఉంది. ఇక ఈ క్రమంలోనే రవితేజ సినిమా ఆఫర్ అనేది తాప్సీ పన్ను ముందుకు వెళ్ళింది అని తెలుస్తుంది. చూడాలి తాప్సీ ఈ సినిమా ఒప్పుకుంటుందా… లేదా అనేది.

ఇవి కూడా చదవండి :

ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

పదవి పోవడంపై గంగూలీ రియాక్షన్ ఇలా..?

Visitors Are Also Reading