Home » పదవి పోవడంపై గంగూలీ రియాక్షన్ ఇలా..?

పదవి పోవడంపై గంగూలీ రియాక్షన్ ఇలా..?

by Azhar
Ad

బీసీసీఐ ప్రెసిడెంట్ గా మూడేళ్లు కొనసాగిన సౌరవ్ గంగూలీ.. ఇప్పుడు ఆ పదవిని పోగొట్టుకున్నాడు. అయితే ఈ నెల 18న జరగుతున్న ఎన్నికల్లో మళ్ళీ దాదానే ప్రెసిడెంట్ అవుతాడు అని అందరూ అనుకున్నారు. కానీ ఊహించని విధంగా దాదాకు ఆయా పదవి అనేది దూరం అయ్యింది. బోర్డులోని పెద్దలు అందరూ గంగూలీకి వ్యతిరేకం కావడంతో.. తప్పక ప్రెసిడెంట్ పోటీ నుండి దాదా తప్పుకున్నాడు.

Advertisement

ఇక గంగూలీ ఎప్పుడైతే ఈ పోటీలో లేడు అనే వార్త తెలిసిందో… అప్పటి నుండి మీడియాలో గంగూలీ తప్పుకోవడానికి గల కారణాలు ఇవే అంటూ చాలా రకాల వార్తలు వచ్చాయి. ఇక ఇందులోకి రాజకీయం కూడా చేరింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఎన్ని వార్తలకు దాదా తనదైన రీతిలో సమాధానం ఇచ్చాడు. ఈరోజు ఓ కార్యక్రమంలో పాల్గొన గంగూలీ తన పదవిని కోల్పోవడంపై మాట్లాడాడు.

Advertisement

దాదా మాట్లాడుతూ.. నేను భారత జట్టుకు కెప్టెన్ గా చేశాను. ఆ తర్వాత కోల్కతా క్రికెట్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇక ఇన్ని రోజులు బీసీసీఐ ప్రెసిడెంట్ గా ఉన్నాను. అయితే ఆటగాడిగా కానీ.. అడ్మినిస్ట్రేటర్ గా గాని.. పూర్తిగా ఉండలేము. ఎప్పుడో ఓ సారి తప్పుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంతకంటే పెద్ద పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని గంగూలీ పేర్కొన్నాడు. ఇక ప్రస్తుతం ప్రెసిడెంట్ పదవిపై దాదా చేసినా కామెంట్స్ అనేవి వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి :

ఖుషిలో కోహ్లీ ఫ్యాన్స్.. ఫామ్ లోకి వచ్చాడు అని కాదు..!

ఇండియా ఫ్యాన్స్ మంచోళ్ళు అంటూ సొంత ఫ్యాన్స్ కు పాక్ విమర్శలు..!

Visitors Are Also Reading