Home » కాబోయే భర్తతో హీరోయిన్‌ తాప్సి ఎంజాయ్‌…!

కాబోయే భర్తతో హీరోయిన్‌ తాప్సి ఎంజాయ్‌…!

by Bunty
Ad

 

నటి తాప్సి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అమ్మడు తెలుగులో ఝుమ్మందినాదం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. దీంతో ఈ అమ్మడు బాలీవుడ్ ఇండస్ట్రీవైపుకు వెళ్ళిపోయింది. అక్కడ తాప్సిని ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అక్కడి కుర్రాళ్లకు తాప్సి కలల రాకుమారిగా మారిపోయింది. తాప్సికి సంబంధించి గత కొంతకాలం నుంచి ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.

Taapsee Pannu celebrates New Year’s with rumoured partner Mathias Boe

తాను ఓ వ్యక్తితో ప్రేమలో ఉందంటూ… తనతో వెకేషన్స్ కి కూడా వెళ్తుంది అంటూ ఎన్నో రకాల వార్తలు వస్తున్నప్పటికీ దీనిపై తాప్సి ఇంతవరకు స్పందించలేదు. తాజాగా న్యూ ఇయర్ రోజున తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి దిగిన ఓ బ్యూటిఫుల్ ఫోటోను షేర్ చేస్తూ… తన అభిమానులకి న్యూ ఇయర్ విషెస్ ని తెలియజేసింది. తాను పోస్ట్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారాయి. తాప్సి బాయ్ ఫ్రెండ్ పేరు మాథియస్. ఇతను డెన్మార్క్ కు చెందిన వ్యక్తి. ఇతను బ్యాడ్మింటన్ ఆటగాడు. ఎన్నో గోల్డ్ మెడల్స్ ని సైతం సొంతం చేసుకున్నాడు.

Advertisement

ప్రస్తుతం మాథియస్ బ్యాడ్మింటన్ కోచ్ గా గోపీచంద్ తో కలిసి మన ఇండియన్ ప్లేయర్స్ ఎంతోమందికి శిక్షణ ఇస్తూ ఇండియాలోనే ఉంటున్నాడు. ప్రస్తుతం తాప్సి బాయ్ ఫ్రెండ్ మాథియస్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. అందరి నోట్లో ప్రస్తుతం ఇదే వార్త వినిపిస్తోంది. ఇక వీరిద్దరూ ఇక వీరి ప్రేమ విషయాన్ని తాప్సి అనౌన్స్ చేసిన వెంటనే ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక తన అభిమానుల కామెంట్లకు తాప్సి సమాధానం ఇస్తుందో లేదో చూడాలి. వీరు తొందరలోనే వివాహం చేసుకోవాలని తన అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading