Home » స్విగ్గి చేసిన పనికి షాక్ లో షారుఖ్ ఖాన్..అసలేమైందంటే?

స్విగ్గి చేసిన పనికి షాక్ లో షారుఖ్ ఖాన్..అసలేమైందంటే?

by Srilakshmi Bharathi
Ad

బాలీవుడ్ ప్రముఖ నటుడు షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వరుసగా సినిమాలతో దూసుకుపోతున్న షారుఖ్ ఖాన్ తన అభిమానులతో కూడా ఎల్లప్పుడూ టచ్ లో ఉంటూ ఉంటారు. ఇటీవలే షారుఖ్ పఠాన్ సినిమా విడుదల అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోట్ల కలెక్షన్స్ తీసుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. దీనితో షారుఖ్ అభిమానులు కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు.

sharukh khan

Advertisement

సోషల్ మీడియాలో ఆక్టివ్ గానే ఉండే షారుఖ్ ఖాన్ ఇటీవల ఆస్క్ ఎస్ఆర్కే( Ask SRK ) అనే చాట్ సెషన్ ను ఫాన్స్ కోసం స్టార్ట్ చేసాడు. ఈ సెషన్ లో చాలా మంది అభిమానులు ఎస్ ఆర్ కె ను ప్రశ్నలు అడగగా షారుఖ్ కూడా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని షారుఖ్ ను తిన్నారా అని అడిగాడు. దీనికి షారుఖ్ ఫన్నీ గా ఎందుకు భయ్యా నువ్వు స్విగ్గి లో ఆర్డర్ పెడతావా? అని జోక్ చేసారు.

Advertisement

sharukh khan

 

షారుఖ్ జోక్ చేయడమే ఆలస్యం స్విగ్గి రంగంలోకి దిగింది. ఒకరు ఇద్దరు కాదు, ఏకంగా పది మంది స్విగ్గి డెలివరీ బాయ్స్ షారుఖ్ కి ఫ్రీ ఫుడ్ డెలివరీ చేయడానికి షారుఖ్ ఇంటి ముందు వాలిపోయారు. స్విగ్గి బాయ్స్ మీకోసం ఫుడ్ తీసుకొచ్చారు అంటూ సదరు సంస్థ ట్వీట్ చేసింది కూడా. స్విగ్గి చేసిన ఈ పబ్లిసిటీ యాక్ట్ ను చూసి ఇది మామూలు వాడకం కాదు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరిన్ని ముఖ్య వార్తలు:

ఉదయం పూట బ్రేక్‌ఫాస్ట్‌ చాలా ముఖ్యం.. లేదంటే ఆ సమస్యలు తలెత్తడం పక్కా..!

చిరంజీవి కెరీర్ లో మధ్యలోనే ఆగిపోయిన 7 క్రేజీ ప్రాజెక్ట్ లు ఇవే…!

మరో 20 ఏళ్లలో నక్షత్రాలు మనకు కనిపించవు.. కారణం ఏంటంటే ?

Visitors Are Also Reading