Home » SKY : జట్టులో ప్లేస్‌ దొబ్బేశాడు..ఇప్పుడు సంజూ జెర్సీ కూడా లాగేసుకున్న సూర్య !

SKY : జట్టులో ప్లేస్‌ దొబ్బేశాడు..ఇప్పుడు సంజూ జెర్సీ కూడా లాగేసుకున్న సూర్య !

by Bunty
Ad

కరేబియన్ గడ్డపై టెస్ట్ సిరీస్ ను గెలుచుకున్న టీమిండియా వన్డే సిరీస్ లోను బోనీ కొట్టింది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టు విండీస్ ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ లో సూర్య కుమార్ యాదవ్, సంజు శాంసన్ జెర్సీతో మైదానంలో అడుగుపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అసలే సంజుకు టీంలో చోటు దక్కలేదని బాధపడుతున్న ఫ్యాన్స్ కు ఇది మరింత కోపం తెప్పించింది.

Advertisement

అసలు సంజు జెర్సీని సూర్య ఎందుకు వేసుకోవాల్సి వచ్చిందంటూ ఇంటర్నెట్ లో తెగ వెతుకుతున్నారు నెటిజన్స్. అసలు ఏం జరిగిందంటే ….. సూర్యకుమార్ యాదవ్ చాలా పెద్ద సైజు జెర్సీని ఆర్డర్ ఇచ్చాడు. కానీ మేనేజ్మెంట్ సూర్యకు చిన్న సైజు జెర్సీని ఇచ్చింది. ప్లేయింగ్ గేమ్ లెవెల్లో చోటు దక్కించుకొని సంజు శాంసన్ జెర్సీ లార్జ్ సైజ్ కావడంతో తనకు ఇచ్చిన మీడియం సైజ్ టీషర్టును పక్కనపెట్టి సంజు శాంసన్ జెర్సీని వేసుకుని మైదానంలో అడుగు పెట్టాడు.

Advertisement

అలా వచ్చాడో లేదో సూర్య కుమార్ యాదవ్ కంటే అతను వేసుకునే జెర్సీ హైలెట్ అయింది. దీంతో సోషల్ మీడియాలో సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మపై ట్రోల్స్ మొదలయ్యాయి. ఇక సంజు శాంసన్ ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మపై విపరీతంగా ట్రోల్స్ మొదలుపెట్టారు. రోహిత్, సూర్య మధ్య డీల్ కుదిరిందని మాట్లాడుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

“BRO”లో అంబటి రాంబాబు..ఇదేందయ్యా ఇది !

సీఎంకే ఫోన్ చేసి తన కూతురు పెళ్లికి రావద్దని చెప్పిన సూపర్ స్టార్ కృష్ణ..!

కావ్య బాధపడుతుంటే చూడలేకపోయా.. సన్‌రైజర్స్ పై రజినీకాంత్‌ సంచలనం

Visitors Are Also Reading