Home » Suryakumar Yadav : టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ ఎంపిక?

Suryakumar Yadav : టీమిండియా కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్‌ ఎంపిక?

by Bunty
Ad

టీమిండియా కు మరో కొత్త కెప్టెన్ రానున్నాడు. టీమిండియా 360 డిగ్రీస్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ను టీమిండియా కెప్టెన్ చేయాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతుంది. వచ్చే నెలలో టీమిండియా జట్టు… టి20 లో కోసం ఐర్లాండ్ లో పర్యటించనుంది. ఈ టి20 ల కోసం.. హార్దిక్ పాండ్యా స్థానంలో… డేంజర్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ ను టీమిండియా కెప్టెన్ చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నారు.

Advertisement

అక్టోబర్లో ప్రపంచ కప్ ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అక్టోబర్ 5వ తేదీ నుంచి నవంబర్ 19వ తేదీ వరకు వన్డే వరల్డ్ కప్ ఇండియాలో జరగనుంది. ఈ వరల్డ్ కప్ లో… ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా పాత్ర చాలా కీలకం. ఇలాంటి తరుణంలో వచ్చే నెలలో జరిగే ప్రాధాన్యత లేని ఐర్లాండ్ సిరీస్ కోసం హార్దిక్ పాండ్యాను పంపించాలని అస్సలు అనుకోవడం లేదు బీసీసీఐ.

Advertisement

ఐర్లాండ్ సిరీస్ నేపథ్యంలో పాండ్యాకు రెస్ట్ ఇవ్వాలని సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారట. అలాగే రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ, గిల్ లను కూడా ఐర్లాండ్ సిరీస్ కు పంపించాలని బిసిసిఐ భావించడం లేదట. ఇలా స్టార్ ప్లేయర్ లందరికీ రెస్ట్ ఇచ్చి… సూర్య కుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలు ఇవ్వాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుందట. ఇక దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానున్నట్లు తెలుస్తోంది. కాగా టీ20 మ్యాచ్ లలో సూర్యకుమారి యాదవ్ చాలా దాటిగా ఆడతారన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

గ్రాండ్ గా SRH కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ పెళ్లి…ఫోటోలు వైరల్

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

బిచ్చగాళ్ళు మీకు ఎదురు వస్తున్నారా.. అయితే మీరు ఎంతో అదృష్టవంతులు..!

 

Visitors Are Also Reading