Home » బాబర్ ను పడేసిన సూర్య కుమార్..!

బాబర్ ను పడేసిన సూర్య కుమార్..!

by Azhar
Ad

ఇండియా, పాకిస్థాన్ అంటేనే ఎప్పుడు చర్చ. ఈ రెండు దేశాల మధ్య ఎలాంటి మ్యాచ్ అనేది జరిగిన కూడా అది వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ఇండియా, పాక్ ఆటగాళ్లు కేవలం మైదానంలోనే కాదు.. ర్యాంకింగ్స్ లో కూడా పోటీ పడుతుంటారు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ లో పాకిస్థాన్ యొక్క ఆధిపథ్యం గతంలో ఎక్కువగా ఉండేది. కానీ దానిని భారత బ్యాటర్ సూర్య కుమార్ దించేసాడు.

Advertisement

గతంలో ఓ సరి బాబర్ ను దాటేసి బ్యాటింగ్ లో మూడో స్థానానికి చేరాడు సూర్య. కానీ ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో బాబర్ ఎంచారి చేయడంతో ఏకంగా రెండో స్థానానికి వెళ్ళాడు. అయితే ఇప్పుడు బాబర్ ను మళ్ళీ పడేసాడు సూర్య కుమార్. హైదరాబాద్ లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ లో సూర్య హాఫ్ సెంచరీతో రాణించాడు సూర్య.

Advertisement

అందువల్ల తాజాగా ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో బాబర్ ను కిందికి నెట్టేశాడు. ఇప్పటివరకు నాలుగో స్థానంలో ఉన్న సూర్య.. తాజాగా 801 పాయింట్లతో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఇక మొదటి స్థానంలో పాక్ బ్యాటర్ 861 పాయింట్లతో మొదటి స్థానంలో ఉండగా.. బాబర్ ఆజాం 799 పాయింట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ఇక బౌలింగ్ లో కేవలం భువనేశ్వర్ కుమార్ ఒక్కడే టాప్ 10లో 10వ స్థానంలో ఉండగా.. ఆల్ రౌండర్ లలో టాప్ 10 లో ఒక్క ఇండియా ప్లేయర్ కూడా లేడు.

ఇవి కూడా చదవండి :

భువీ వైఫల్యానికి కారణం ఏంటో తెలుసా..?

రోహిత్, కార్తీక్ లతో ప్రచారం చేస్తున్న మన పోలీసులు..!

Visitors Are Also Reading