Home » ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ..?

ప్రేమ వివాహాలలోనే విడాకులు ఎక్కువ..?

by Bunty
Published: Last Updated on
Ad

ఈ మధ్యకాలంలో ప్రేమ వివాహాలు బాగా జరుగుతున్న సంగతి తెలిసిందే. స్కూల్ టైం నుంచే ప్రేమించడం.. ఆ తర్వాత ప్రేమ పెళ్లి చేసుకోవడం కామన్ అయిపోయింది. ఇంకా ఇంట్లో ఒప్పుకోకపోతే లేచి పోవడం కూడా రెగ్యులర్ అయిపోయింది. లైఫ్ లో సెటిల్ అయినా కాకపోయినా… ప్రేమే దైవం అంటూ కొంతమంది ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే ప్రేమ వివాహాలు విపరీతంగా పెరిగిపోయాయి. అయితే తాజాగా సుప్రీంకోర్టు ధర్మశానం ఈ ప్రేమ వివాహాలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

Advertisement

 

ప్రేమ వివాహాలలోనే ఎక్కువగా విడాకులు అవుతున్నాయని హాట్ కామెంట్స్ చేసింది. తాజాగా ఓ జంట సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమకు విడాకులు కావాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మతం మారడానికి తన భార్య ఒప్పుకోవడం లేదని ఓ భర్త ఈ పిటిషన్ వేశాడు. అయితే ఇద్దరినీ కాంప్రమైజ్ చేస్తామని కోర్టు చెప్పినప్పటికీ ఆ వ్యక్తి ఒప్పుకోలేదు. దీంతో వారిద్దరికీ విడాకులు మంజూరు చేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే వారిద్దరిది ప్రేమ వివాహమే.

Advertisement

ఇక వీరికి విడాకులు ఇస్తూ ప్రేమ వివాహాలపై కీలక వ్యాఖ్యలు చేసింది సుప్రీంకోర్టు. ప్రస్తుత జనరేషన్లో ప్రేమ వివాహాలు విపరీతంగా జరుగుతున్నాయని పేర్కొంది. అదే స్థాయిలో ప్రేమ వివాహాలు చేసుకున్న వారే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారని కూడా పేర్కొంది. అరేంజ్ మ్యారేజ్ కంటే ప్రేమ వివాహం చేసుకున్న వారే ఎక్కువగా కోర్టుకు వస్తున్నారని సుప్రీంకోర్టు అభిప్రాయ పడింది. అంతేకాదు… భార్యాభర్తలకు ఇద్దరికీ ఇష్టం లేకపోతే… ఆరు నెలల కాల పరిమితి అనే రూల్ తో సంబంధం లేకుండానే.. వారికి విడాకులు ఇవ్వవచ్చని సెక్షన్లు కూడా ఉన్నాయని సుప్రీంకోర్టు తెలిపింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

దూసుకొచ్చిన కుక్క, భయంతో 3వ అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్

Visitors Are Also Reading