తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి అప్పుడప్పుడే మెగాస్టార్‌గా ఎదుగుతున్న రోజులవి. చిరంజీవి నటించిన సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి. ఆ సమయంలో చిరంజీవి సినిమాలు సంచలనమే సృష్టించాయి. ఓ వైపు సూపర్ స్టార్ కృష్ణ దుమ్ముదులుపుతున్న తరుణంలో ఆయన వీటికి తట్టుకుని నిలబడి గట్టి పోటీ ఇచ్చిన హీరో చిరంజీవి.అప్పటికే ఖైదీ, విజేత మగమహారాజు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, శుభలేఖ వంటి సినిమాలు విజయాలతో జోరు మీద ఉన్నారు చిరంజీవి.
Advertisement
వాస్తవానికి తెలుగు సినిమా పౌరానికం నుంచి కమర్షియల్ వైపు మారినప్పటికీ మన హీరోలందరూ కూడా ఏదో ఒక లోటుతో ఉన్నారు. వారికొచ్చిన విధంగా డ్యాన్స్‌లు, ఫైట్ చేసుకుంటూ పోతున్నారు. ఏదారి లేక ప్రేక్షకుడు కూడా వాళ్లని చూస్తున్నాడు. అలాంటి సమయంలో దర్శక నిర్మాతల ఆలోచనలకు, ఇమాజినేషన్‌కు తగ్గట్టు వెండితెర మీద పర్‌ఫెక్ట్‌గా కనిపించే నటుడిగా చిరంజీవి ఎదిగాడు. ఓ విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా కథ, కథనాలు చిరంజీవి సరికొత్త స్పీడ్ అందుకుందని చెప్పవచ్చు. ఆ సమయంలో మలయాళం రీమెక్‌గా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పసివాడి ప్రాణం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డు సృష్టించింది ఈ సినిమా. తెలుగు సినిమా చరిత్రలో మొట్టమొదటిసారి బ్రేక్ డ్యాన్స్ చేసిన ఘనత మెగాస్టార్ చిరంజీవికి దక్కింది. పసివాడి ప్రాణం సినిమా గురించి ఇప్పుడు ఆసక్తికరవిషయాలు తెలుసుకుందాం.
తెలుగులో ఈ సినిమా కోసం చాలా మంది నిర్మాతలు పోటీ పడ్డారు. తొలుత ఈ సినిమాను మలయాళంలో పువిన్ పుత్తే పున్నేలన్ అనే సినిమా చేశారు. దీనికి తమిళంలో కమర్షియల్ హంగులు అద్ది సత్యరాజ్ హీరోగా ఫజిల్ ఈ సినిమాను తయారు చేశార. మలయాళం, తమిళంలో హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో గీతాఆర్ట్స్ అధినేత అల్లుఅరవింద్ దక్కించుకున్నారు. చిరంజీవి హీరోగా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో చేయాలనుకున్నారు. రచయిత జెంజాలను పిలిపించి చిరంజీవికి ఇమేజ్‌కు తగ్గట్టు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. అసలు పాటలు అవకాశం లేని ఈకథలో 5 పాటలు వచ్చేవిధంగా సిద్ధం చేశారు. పిల్లలకు, పెద్దలకు, మహిళలకు ఇలా అందరినీ మెప్పించేవిధంగా కథను తయారు చేశారు.
Advertisement
మరోపక్క విట్‌నెస్ ఆధారంగా బాపినీయుడు సాక్షి ఆధారంతో మరొక కథను తయారు చేశారు. కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్ లో అల్లూరి రాధాకృష్ణన్ మూర్తి దర్శకత్వంలో ఆ సినిమా చేయాలనుకున్నారు. బాలనటుడి పాత్రలో మహేష్‌బాబుని అనుకున్నారు. ఇలా అన్ని ఏర్పాట్లు చేసుకున్న సమయంలోనే చిరంజీవి ఇదే కథతో సినిమాను చేస్తున్నారనే విషయం తెలిసి కృష్ణ ఆ సినిమాను విరమించుకున్నారు. చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్‌గా, రఘువరన్ విలన్‌గా సెలక్ట్ అయ్యారు. అల్లు రామలింగయ్య, గుమ్మడి జంగయ్య, కన్నడ ప్రభాకర్, ప్రసాద్‌బాబు , గిరిబాబు, రాజ్యలక్ష్మి వంటి ప్రముఖ నటులను కూడా తీసుకున్నారు. ప్లాష్‌బ్యాక్‌లో ఓ పాత్రకు సుమలతను సెలక్ట్ చేశారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ కోసం చాలా సేపు ఆలోచించారు. రచయిత సత్యమూర్తి కసక్ అనే టైటిల్ సూచించారు. చిరంజీవి సినిమాకు ఆ టైటిల్ బాగోదు అని అల్లు అరవింద్ ప్రాణానికే ప్రమాదం అనుకున్నారు. చివరకు పసివాడి ప్రాణం ఖరారు చేశారు.
అల్లు అరవింద్ లోగోతో సహా డిజైన్ చేసి చూయించాక పసివాడి ప్రాణం టైటిల్‌ను కోదండరామిరెడ్డి ఒప్పుకున్నారు. చక్కని చుక్క సందిట బ్రేక్ డ్యాన్స్‌తో పాటు అలా రూపొందించి అప్పట్లో పాటను తీయాలంటే కాశ్మీర్‌కు వెళ్లాలి. ఈ సినిమాలో దాదాపు అన్ని పాటలు కాశ్మీర్ లో నే చిత్రీకరించారు. అప్పుడే బ్రహ్మనందం ఇండస్ట్రీలోకి వచ్చారు. ఈ సినిమాలో అవిటివాడి సన్నివేశంలో అద్భుతంగా నటించారు. మొత్తానికి 45 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. కథ పరంగా ఈ సినిమా చాలా సింపుల్‌గానే ఉంటుంది కానీ సెంటిమెంట్, ప్రేమ, తాగుడు, చిన్నపిల్లల గురించి అద్భుతంగా తెరకెక్కించారు. విలన్ చేసిన హత్యకు పిల్లవాడు సాక్షం కావడం.. ఆ పిల్లవాడిని రక్షించడానికి సస్పెన్స్ జోడించడంతో ప్రేక్షకులను ఉత్కంఠ పెంచారు. ఈ సినిమా రఘువరన్‌కు మంచి పేరు తీసుకొచ్చింది. 38 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. తిరుపతిలో మిని ప్రతాప్ థియేటర్‌లో రోజుకు 5 ఆటలతో 175 రోజులు ఆడింది. మద్రాస్‌లో 175 రోజుల వేడుక నిర్వహించారు. రాధా, భానుప్రియ ప్రత్యేకంగా ఈ సినిమాకు ప్రత్యేకంగా హాజరయ్యారు. పసివాడి ప్రాణం అప్పట్లోనే రూ.4.8 కోట్ల వసూలు చేసింది. చిరంజీవి కెరీర్ లోనే ఇది అద్భుతమైన సినిమాగా నిలిచిపోయింది.
ఇవి కూడా చదవండి :
- దేవుళ్ళు సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడెలా ఉందో తెలుసా..?
- ఉదయ్ కిరణ్ లవ్ స్టోరీ చిరంజీవికి ముందే తెలుసు.. కానీ ఏమి జరిగిందంటే..?
- ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!