Home » సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమా విడుద‌ల రోజే ఎందుకు 144 సెక్ష‌న్ పెట్టాల్సి వ‌చ్చింది.? ఆరోజు ఏమైంది..?

సూప‌ర్ స్టార్ కృష్ణ సినిమా విడుద‌ల రోజే ఎందుకు 144 సెక్ష‌న్ పెట్టాల్సి వ‌చ్చింది.? ఆరోజు ఏమైంది..?

by Anji
Ad

సూప‌ర్ స్టార్ కృష్ణ అప్ప‌ట్లో ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల్లో న‌టించారు. ముఖ్యంగా ఆయ‌న హిట్ చిత్రాల్లో సింహాస‌నం సినిమా ఒక‌ట‌ని చెప్పాలి. ఈ చిత్రం విడుద‌లై దాదాపు 36
సంవ‌త్స‌రాలు గ‌డిచిన‌ప్ప‌టికీ ఈ త‌రం వారికి ఈ సినిమా గురించి అంత‌గా తెలియ‌క‌పోయి ఉండ‌వ‌చ్చ‌నే చెప్పాలి. ఈ సినిమా యొక్క ప్ర‌త్యేక‌త గురించి తెలిస్తే మాత్రం వెంట‌నే ఈ సినిమాను చూడ‌కుండా ఉండ‌లేర‌ని చెప్పొచ్చు. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌టించిన సింహాస‌నం సినిమా ప్ర‌త్యేక‌త ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఇక సింహాస‌నం సినిమాకు ద‌ర్శ‌క‌త్వం, నిర్మాత‌, ఎడిట‌ర్‌, హీరో అన్ని సూప‌ర్‌స్టార్ కృష్ణ నే వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. అంతేకాదు.. తెలుగులో మొట్ట‌మొద‌టి 70 ఎం.ఎం. స్టీరియోఫొనిక్ సౌండ్ సినిమా కూడా ఇదేన‌ట‌. ఈ సినిమా ప్ర‌త్యేక‌త గురించి సింపుల్‌గా చెప్పాలంటే 80 సంవ‌త్స‌రాల కాలంలో ఈ సినిమా కూడా మ‌రో బాహుబ‌లి సినిమా అనే చెప్ప‌వ‌చ్చు. ఈ చిత్రం వ‌సూళ్ల విషయంలో కానీ, రికార్డుల విష‌యంలో కానీ బాహుబ‌లి సినిమాకు ఏమాత్రం తీసిపోద‌ని చెప్ప‌వ‌చ్చు.

Advertisement

సింహాస‌నం విడుద‌లైన స‌మ‌యంలో సినిమా టికెట్ల కోసం ప్రేక్ష‌కులు 12 కిలోమీట‌ర్ల మేరా లైన్‌లో వేచి ఉన్నారంటే ఈ సినిమా ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యాన్ని సృష్టించిందో అర్థం అవుతోంది. విజ‌యవాడ రాజ్ థియేట‌ర్‌లో ఈ సినిమా విడుద‌లైన రోజున కిలోమీట‌ర్ల మేర‌కు లైన్‌లో జ‌నాలు క్యూ క‌ట్టార‌ట‌. అందుకే ఆ ప్రాంతంలో 144 సెక్ష‌న్ విధించారు. ఈ విష‌యాన్ని సూప‌ర్ స్టార్ కృష్ణ స్వ‌యంగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆ రోజుల్లో ఈ సినిమాను నిర్మించ‌డం కోసం 3.5 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు కాగా.. ఈ కింద 5 కోట్లు వ‌సూలు చేసి రికార్డును సృష్టించింద‌ట‌. ఈ సినిమా 100 రోజుల ఫంక్ష‌న్ చెన్నైలో నిర్వ‌హించ‌గా.. కార్య‌క్ర‌మానికి కృష్ణ అభిమానులు 400 బ‌స్సుల‌తో అక్క‌డికి చేరుకున్నారు. అంటే 36 ఏండ్ల కింద‌టే అద్భుత‌మైన రికార్డుల‌ను సృష్టించిన సినిమా సింహాస‌నం.

Also Read : 

అల‌నాటి చిరంజీవి హీరోయిన్ అరుణ ఆస్తుల విలువ అన్ని కోట్లా..? అస‌లు నిజం అదేన‌ని తెలుసా..?

“బంగారం” సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా..?.ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి….!

 

Visitors Are Also Reading