Bangaram Movie Child Artist Name and Images: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మీరా చోప్రా జంటగా నటించిన సినిమా బంగారం. ఈ సినిమా పవర్ స్టార్ అభిమానులను నిరాశపరిచినా కొంతమందికి ఈ సినిమా చాలా నచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్ కు చెల్లిగా నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ తన నటనతో ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. వింద్యా రెడ్డి పాత్రలో నటించిన ఆ చిన్నారి పేరు సనూషా సంతోష్ కాగా బంగారం సినిమా తోనే టాలీవుడ్ కు పరిచయం అయ్యింది.
Bangaram Movie Child Artist Name and Images
ఈ సినిమా కంటే ముందే సనూష మలయాళం లో దాదాపు 20 కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. అంతే కాకుండా చిన్న వయసులోనే రెండు సార్లు ఉత్తమ బాలనటిగా జాతీయ ఆవార్డులు అందుకుంది. తెలుగులో బంగారం సినిమా తో ఎంట్రీ ఇవ్వగా మొదటి సినిమా తోనే ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది.
Bangaram Movie Child Artist Name and Images
ఇదిలా ఉంటే 2012 లో సనూష మిస్టర్ మురుగన్ అనే సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా తర్వాత తెలుగులో వచ్చిన రేణిగుంట, జీనియస్ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది. చివరగా నాని హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమా జెర్సీ లో జర్నలిస్ట్ పాత్రలో నటించి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ తరవాత ఎన్నో అవకాశాలు వచ్చినా మళ్లీ మాలీవుడ్ వెళ్లి స్థిరపడింది.
ప్రస్తుతం మాలీవుడ్ లో హీరోయిన్ గా చేస్తూ సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టిివ్ గా ఉంటుంది. తన ఫోటోలు, సినిమాల కు సంబంధించిన వివరాల ను షేర్ చేస్తుంది. కాస్త బొద్దుగా ఉండే సనుషా అప్పట్లో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్లు చేసింది. తన పై చేస్తున్న కామెంట్స్ కు ఘాటుగా రిప్లై ఇచ్చింది. అదేవిధంగా లాక్ డౌన్ సమయం లో ఒంటరి తనం నిరాశ చెందానని దాంతో ఎవరికీ తెలియకుండా మానసిక వైద్యుడ్ని సంప్రదించానని తెలిపింది.
Also read : “ఖుషి” షూటింగ్ లో ప్రమాదం….ఆస్పత్రిలో చేరిన సమంత, విజయ్ దేవరకొండ…!