Home » దేశంలోనే అతిపెద్ద పొడ‌వైన రైలు ఇదే.. 6 ఇంజిన్‌లు, 295 బోగీలు..!

దేశంలోనే అతిపెద్ద పొడ‌వైన రైలు ఇదే.. 6 ఇంజిన్‌లు, 295 బోగీలు..!

by Anji
Ad

భార‌త‌దేశానికి స్వాతంత్య్రం వ‌చ్చి 75 సంవ‌త్స‌రాలు పూర్త‌యిన సంద‌ర్భంగా దేశ‌వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మ‌హోత్స‌వ్ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. ఇందులో భాగంగా ఆగ‌స్టు 15న అతిపెద్ద రైలును న‌డిపి భార‌తీయ రైల్వే సంస్థ రికార్డును సృష్టించింది. సాధార‌ణంగా గూడ్స్ బండికే 100 అంత‌కంటే ఎక్కువ బోగీలు క‌నిపిస్తుంటాయి. గూడ్స్ ట్రైన్ వెళ్తుంటే కొంత స‌ర‌దాగా బోగీలు లెక్క‌పెడుతుంటారు. ఆగ‌స్టు 15 సంద‌ర్బంగా ఇండియ‌న్ రైల్వేస్ న‌డిపిన రైలుకు ఎన్ని బోగీలు తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు.

Advertisement

భార‌త రైల్వేస్ న‌డిపిన రైలుకు ఏకంగా 295 బోగీలున్నాయి. ఈ రైలు పొడ‌వు 3.5 కిలోమీట‌ర్లు. ఇంత పెద్ద రైలును న‌డిపేందుకు ఏకంగా 6 ఇంజ‌న్లున్నాయి. రైలుకి భార‌త రైల్వే అధికారులు సూప‌ర్ వాసుకి అని పేరు పెట్టారు. ఈ రైలుకు సంబందించిన వీడియోల‌ను తాజాగా రైల్వే శాఖ మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ తో పాటు, ఆగ్నేయ మ‌ధ్య రైల్వే శాఖ అధికారులు ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేయ‌గా.. అవి క్ష‌ణాల్లోనే వైర‌ల్ గా మారాయి. ఆగ్నేయ మ‌ధ్య రైల్వే జోన్ ప‌రిధిలో చ‌త్తీస్‌గ‌డ్‌లో భిలాయ్ నుంచి కోర్బా వ‌ర‌కు దీనిని న‌డిపారు.

ఈ రైలు ఒకేసారి ఏకంగా 27వేల ట‌న్నుల బొగ్గును త‌ర‌లించారు. ఒకే రైలులో ఇంత భారీగా స‌రుకు ర‌వాణా చేయ‌డం రైల్వే చ‌రిత్ర‌లోనే ఇదే మొద‌టిసారి. ఈ రైలులో త‌ర‌లించిన బొగ్గుతో 3వేల మెగావాట్ల సామ‌ర్థ్యం ఉన్న థ‌ర్మ‌ల్ విద్యుత్ కేంద్రాన్ని ఒక‌రోజు మొత్తం న‌డ‌ప‌వ‌చ్చ‌ని అధికారులు పేర్కొంటున్నారు. విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు కొర‌త‌ను నివారించ‌డం, త‌క్కువ స‌మ‌యంలో వీలైనంత ఎక్కువ బొగ్గు స‌ర‌ఫ‌రా కోసం రైల్వే అధికారులు ఇలాంటి పొడ‌వైన రైళ్ల‌ను వినియోగిస్తుంటారు. రెండు, మూడు రైళ్ల‌కు బ‌దులు ఒకే రైలును న‌డ‌ప‌డం వ‌ల్ల రైల్వే ట్రాఫిక్ స‌మ‌స్య త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు. గ‌తంలో వాసుకి, త్రిశూల్ పేర్ల‌తో అతి పొడ‌వైన గూడ్స్ రైళ్ల‌ను న‌డిపినా వాటి పొడ‌వు 2.8 కిలో మీట‌ర్ల‌లోపే ఉండ‌డం గ‌మ‌నార్హం.

Also Read : 

త‌న ఆస్తి మొత్తాన్ని గుళ్ల‌కు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇచ్చిన ఈ న‌టి గురించి మీకు తెలుసా..?

ఎటువంటి ఆహారం, వ్యాయామంతో ప‌ని లేకుండా ఈ చిట్కాల‌తో హాయిగా నిద్ర‌పోతూ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

 

Visitors Are Also Reading