Home » త‌న ఆస్తి మొత్తాన్ని గుళ్ల‌కు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇచ్చిన ఈ న‌టి గురించి మీకు తెలుసా..?

త‌న ఆస్తి మొత్తాన్ని గుళ్ల‌కు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇచ్చిన ఈ న‌టి గురించి మీకు తెలుసా..?

by Anji
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుత త‌రుణంలో చాలా మంది స్వార్థ‌ప‌రులుగా మారిపోతున్నారు. క‌ష్టాల్లో ఉన్న సొంతం వారికి కూడా సాయం చేయ‌డానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. మాన‌వ‌త్వం చ‌చ్చిపోతుంద‌ని ఈ మ‌ధ్య కాలంలో చోటు చేసుకుంటున్న ఘ‌ట‌న‌ల ద్వారా ప్రూవ్ అయింది. కొంత మంది దానం చేసినా త‌మ సంపాద‌న‌లో చాలా త‌క్కువ మొత్తం మాత్ర‌మే దానం చేసేందుకు ఇష్ట‌ప‌డుతుంటార‌నే సంగ‌తి తెలిసిందే. కానీ ఒక న‌టి మాత్రం త‌న యావ‌దాస్తిని గుళ్ల‌కు, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు ఇచ్చేసింది

Advertisement

స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా కూడా గుర్తింపును సంపాదించుకుంది. ఈమె పేరు కాంచ‌న‌. ఈమెకు ప్రేక్ష‌కుల్లో ఊహించ‌ని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్ర‌కాశం జిల్లాకు చెందిన కాంచ‌న అస‌లు పేరు వ‌సుంధ‌రా దేవి. ఆమె సంప‌న్న కుటుంబంలో జ‌న్మించారు. ఎయిర్ హోస్టెస్ గా కెరీర్ ను ప్రారంభించిన కాంచ‌న ఊహించ‌ని విదంగా సినిమాల్లోకి వ‌చ్చింది. ప్రేమించు చూడు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన కాంచ‌న వీరాభిమ‌న్యు, ఆత్మ‌గౌర‌వం వంటి సినిమాల‌తో న‌టిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

Advertisement

ఇవాళ ఆమె పుట్టిన రోజు . ఇక కాంచ‌న సాంఘిక చిత్రాల‌తో పాటు పౌరాణిక చిత్రాల్లో, జాన‌ప‌ద చిత్రాల్లో న‌టించి కాంచ‌న ప్ర‌శంస‌లు పొందారు. తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో సైతం కాంచ‌న న‌టించారు. ఆస్తిని మొత్తం విరాళంగా ఇచ్చిన కాంచ‌న‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉంది. కొన్నేళ్ల కింద‌ట విడుద‌లై స‌క్సెస్ సొంతం చేసుకున్న అర్జున్ రెడ్డి సినిమాలో కాంచ‌న కీల‌క పాత్ర‌లో న‌టించి మెప్పించారు. త‌న న‌ట‌న‌తో కాంచ‌న ఎన్నో అవార్డులను గెలుచుకున్నారు. కాంచ‌న ఆరోగ్యంగా జీవ‌నం సాగించాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. ఈ జ‌న‌రేష‌న్‌లో కూడా కాంచ‌న‌ను అభిమానించే అభిమానులు ఎంతో మంది ఉన్నారు.

Also Read :  నాగార్జున అమలను పెండ్లి చేసుకోవడం ఏఎన్నార్ కు ఇష్టం లేదట.. అసలు కారణం ఏంటంటే..? విజయ్ దేవరకొండ హీరో కాకముందు ఆ ఉద్యోగం కూడా చేశాడా..?  

Visitors Are Also Reading