Home » ఎటువంటి ఆహారం, వ్యాయామంతో ప‌ని లేకుండా ఈ చిట్కాల‌తో హాయిగా నిద్ర‌పోతూ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

ఎటువంటి ఆహారం, వ్యాయామంతో ప‌ని లేకుండా ఈ చిట్కాల‌తో హాయిగా నిద్ర‌పోతూ బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు..!

by Anji
Ad

చాలా మంది అధిక బ‌రువుతో ఇబ్బంది ప‌డుతుంటారు. కొంద‌రు అయితే అధిక బ‌రువు కార‌ణంగా బ‌య‌టికి వెళ్లాలంటే భ‌య‌ప‌డుతుంటారు. బ‌రువు పెర‌గ‌డం వ‌ల్ల అనేక రోగాల‌కు దారి తీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే బ‌రువు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని డాక్ట‌ర్లు సూచిస్తుంటారు. స‌మ‌యానికి తిన‌క‌పోవ‌డం, లిమిట్ లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే ఎక్కువ బ‌రువు పెర‌గ‌డానికి కార‌ణం అవుతార‌ని పేర్కొంటున్నారు నిపుణులు. బ‌రువు త‌గ్గాల‌నుకుంటే మీరు క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం, ఆహార ప్ర‌ణాళిక‌ను అనుస‌రించ‌లేక‌పోతే నిద్ర ప‌ద్ద‌తుల‌పై ఆధార‌ప‌డ‌వ‌చ్చు. బ‌రువు త‌గ్గ‌డానికి నిద్ర‌లో ఏం చేయ‌వ‌చ్చో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Advertisement

ప్ర‌ధానంగా నిద్ర స‌మయాన్ని సెట్ చేసుకోండి. మీరు ప్ర‌తి రోజూ ఒక నిర్దిష్ట స‌మ‌యానికి నిద్ర‌పోయే రొటిన్ ను అనుస‌రిస్తే మీ శ‌రీరం అదే స‌మ‌యంలో నిద్ర‌పోవ‌డానికి అల‌వాటు ప‌డుతుంది. అల‌సిపోయిన రోజు త‌రువాత ప‌డుకోవ‌డం వ‌ల్ల వెంట‌నే నిద్ర వ‌స్తుంది. 7 నుంచి 8 గంట‌ల వ‌ర‌కు బాగా నిద్ర‌పోవ‌డం బ‌రువు త‌గ్గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది. ప‌డుకునే ముందు ఈ ఆహారాల‌కు దూరంగా ఉండ‌డం బెట‌ర్‌. రాత్రిపూట తేలిక‌పాటి భోజ‌నం చేయాలి. కెఫిన్ క‌లిగిన ఉత్ప‌త్తుల‌ను అస్స‌లు తీసుకోవ‌ద్దు. తేలిక‌పాటి ఆహారాన్ని తిన‌డం వ‌ల్ల జీర్ణ‌శ‌క్తి పెరుగుతుంది.

Advertisement


నిద్ర పోతున్న స‌మ‌యంలో కెల‌రీలు బ‌ర్న్ అవుతాయి. ప‌డుకునే ముందు టీ, కాఫీలు అస్స‌లు తాగ‌కూడ‌దు. నిద్రించే స‌మ‌యంలో గ‌దిలో క‌నీస వెలుతురు ఉండాలి. ఎందుకంటే ప్ర‌కాశవంత‌మైన కాంతి నిద్ర భంగం క‌లిగిస్తుంది. నింద్రించ‌డానికి శుభ్ర‌మైన బెడ్ షీట్లు ఉప‌యోగించండి. రాత్రి భోజ‌నం చేసిన వెంట‌నే నిద్ర పోకూడ‌దు. ఇలా నిద్ర పోవ‌డం ద్వారా జీర్ణ క్రియ స‌రిగ్గా జ‌ర‌గ‌దు. నిద్ర‌కు ఉప‌క్ర‌మించే ముందు క‌నీసం 2 లేదా 3 గంట‌ల ముందు తినాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంకెందుకు ఆల‌స్యం ఈ చిట్కాల‌ను పాటిస్తూ హాయిగా నిద్ర‌పోతే మీ బాడీలో ఉన్న కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గే ఛాన్స్ ఉంటుంది.

Also Read : 

పెళ్లి కాకుండానే 48 మంది పిల్ల‌ల‌కు తండ్రి.. అతని ప్రొఫేష‌న్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

మీకు నిద్ర ప‌డుతుందా..? చ‌క్క‌టి నిద్ర‌కు చిట్కాలు ఇవే..!

Visitors Are Also Reading