Home » సూప‌ర్ స్టార్ కృష్ణ కొడుకు ర‌మేష్ బాబు ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడు..!

సూప‌ర్ స్టార్ కృష్ణ కొడుకు ర‌మేష్ బాబు ఆ నిర్ణ‌యం ఎందుకు తీసుకున్నాడు..!

by Anji
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న సినిమా కెరీర్‌ని అన్న‌య్య ర‌మేష్ బాబుని చూసి మొద‌లుపెట్టారు. స్వ‌యంగా ర‌మేష్ బాబు కోసం కృష్ణ ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌లు చేప‌ట్టారు. త‌న కొడుకుని స్టార్ గా చూడాల‌నుకున్నారు. ర‌మేష్ బాబు హీరోగా క‌ళియుగ క‌ర్ణుడు, ముగ్గురు కొడుకులు సినిమాల‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ స‌మ‌యంలోనే ర‌మేష్ బాబు తో మ‌హేష్ బాబు క‌లిసి న‌టింప‌జేశాడు. మ‌హేష్ బాబుకు ర‌మేష్ బాబు ఇన్‌స్పిరేష‌న్ ఇద్ద‌రి బాధ్య‌త‌ల‌ను మ‌హేష్ మోయాల్సి వ‌చ్చింది.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఒకప్పుడు స్టార్ హీరో అవకాశాల్లేక అలాంటి పని చేస్తున్నాడా..?

Advertisement

ర‌మేష్ బాబుకి క‌ష్టాలు వెన్నంటే ఉన్నాయి. 1965లో కృష్ణ‌-ఇందిర దంప‌తుల‌కు ర‌మేష్ బాబు పుట్టాడు. ఆయ‌న చ‌దువుకుంటున్న సంద‌ర్భంలోనే కృష్ణ సూప‌ర్ స్టార్‌. ద‌క్షిణ భార‌త‌దేశంలో ఆ పేరుని క‌లిగి ఉన్న ఏకైక హీరో కృష్ణ‌నే. త‌న తండ్రి కృష్ణ‌ని చూసి ర‌మేష్ బాబుని చూసి ఆయ‌న కూడా హీరో అవ్వాల‌నుకున్నారు. చిన్న‌ప్ప‌టి అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ను వెండితెర‌పైకి తీసుకొచ్చారు. ఆ మూవీతోనే మొద‌టిసారి వెండితెర‌కు ప‌రిచ‌యం అయ్యారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ సాధించింది. ఆ త‌రువాత ప‌న్నేండ్ల‌కు మ‌నుషులు చేసిన దొంగ‌లు సినిమాలో న‌టించారు. ఆ త‌రువాత 14 ఏళ్ల స‌మయంలో దాస‌రి నారాయ‌ణ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో నీడ‌లో పెద్ద పాత్ర పోషించారు. చ‌దువు పాడ‌వుతుంద‌ని ర‌మేష్‌ని సినిమాకు దూరంగా పంపించారు కృష్ణ‌. డిగ్రీ చ‌దివిన త‌రువాతే సినిమాలో న‌టించాల‌ని కొడుకుకు చెప్పారు. మ‌ళ్లీ డిగ్రీ ఫైన‌ల్ ఇయ‌ర్ ప‌రీక్ష రాయ‌గానే సామ్రాట్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ర‌మేష్‌.


కృష్ణ కొడుకు అంటూ ఈ మూవీని బాగానే ఆద‌రించారు. అంత‌కు ముందు ఏడాదే అక్కినేని నాగార్జున విక్ర‌మ్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ర‌మేష్ బాబు కంటే మూడేళ్ల ముందే బాల‌కృష్ణ హీరోగా కెరీర్ ని ప్రారంభించారు. వీరు వ‌చ్చే నాటికే చిరంజీవి ఒక‌మెట్టు ఎక్కారు. ఖైదీ సినిమా త‌రువాత చిరంజీవి స్టార్ అయ్యారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ వార‌సుల్లో ఎవ‌రు టాప్ హీరో అవుతార‌నేది ర‌మేష్ బాబు తీవ్ర ఒత్తిడి ఉంది. ర‌మేష్ బాబు మంచి న‌టుడిగానే పేరు తెచ్చుకున్నారు. చాలా మంది కృష్ణ అభిమానులు త‌మ పిల్ల‌ల‌కు ర‌మేష్ అని పేరు పెట్టుకున్నారు. సామ్రాట్ త‌రువాత చిన్ని కృష్ణుడు, బ‌జార్ రౌడీ ప‌ర్వాలేద‌నిపించాయి. కానీ కృష్ణ మాత్రం ర‌మేష్ బాబుకి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ రావాల‌నుకున్నారు. ర‌మేష్ బాబుతో పాటు తాను మ‌హేష్ బాబుని కూడా న‌టింప‌జేసి మూవీకి కొత్త క్రేజ్ తీసుకొచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ఇక ఆ త‌రువాత వ‌చ్చిన అన్ని సినిమాలు యావ‌రేజ్ టాక్ వినిపించింది. కృష్ణ‌గారి అబ్బాయి, నా ఇల్లే నా స్వ‌ర్గం, మామా కోడ‌ల్ స‌వాల్‌, ప‌చ్చ‌తోర‌ణం సినిమాలు ర‌మేష్ బాబు కెరీర్‌ని వెన‌క్కి తీసుకెళ్లాయి.

Advertisement

ఇవి కూడా చ‌ద‌వండి :  సీక్వెల్ కోసం బింబిసార దర్శకుడు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా…?


ఇక వ‌రుస ఫ్లాప్‌ల‌తో నిరుత్సాహ‌ప‌డ్డారు. కృష్ణ ఏడాదికి దాదాపు 10 సినిమాలు తీస్తే 3 బ్లాక్ బ‌స్ట‌ర్, 4 హిట్ సినిమాలుండేవి. ఇక తీవ్ర ఒత్తిడిని త‌ట్టుకోలేక ర‌మేష్ బాబు సినిమాల్లో న‌టించ‌డం మానేశారు. సొంత వ్యాపారం చేసుకుంటూ తెర‌మ‌రుగ‌య్యారు.కానీ కృష్ణ మాత్రం ర‌మేష్ బాబునే న‌ట‌వార‌సుడిగా ప్ర‌క‌టించారు. ర‌మేష్ బాబు త‌న బాధ్య‌త‌ను మ‌హేష్ బాబుకే అప్ప‌గించారు. మ‌హేష్ కెరీర్‌ను ద‌గ్గ‌రుండి ఆయ‌న ప‌ర్య‌వేక్షించారు. మ‌హేష్ బాబుకి త‌న అన్న‌య్య ర‌మేష్ బాబు అంటే ప్రాణం. త‌న అన్న మ‌ర‌ణించిన‌ప్పుడు క‌రోనా కార‌ణంగా చివ‌రి చూపు చూడ‌లేనందుకు త‌న బాధ‌ను ఒక పోస్ట్ ద్వారా పంచుకున్నాడు. నువ్వు నాకు అడుగులు నేర్పించావు. నా విజ‌యంలో ప్ర‌తీ సంతోషం నీదే. ఎప్ప‌టిక‌ప్పుడు నీవు నా అన్న‌య్య‌వే. జీవితంలో అలిసిపోయావు. ఇక విశ్రాంతి తీసుకో. నిన్ను ఎప్ప‌టికి మ‌రువ‌నంటూ క‌న్నీటి బాధ‌ను అక్ష‌ర రూపంలో మ‌హేష్ బాబు పంచుకున్నారు.

 ఇవి కూడా చ‌ద‌వండి :  తెల్ల జుట్టుకు క‌ల‌ర్ వేసుకోవ‌ద్దు.. ఈ ఫ్యాక్ వేసుకుంటే చాలు..!

తొంద‌ర పాటు నిర్ణ‌యాలు కూడా ర‌మేష్ బాబుని వెన‌క్కి నెట్టాయి. ఆ త‌రువాత మృధుల‌ను పెళ్లి చేసుకొని హాయిగా వ్యాపారం చేసుకుంటూ ఒత్తిడి లేకుండా లైఫ్‌లో ముందుకు సాగారు. వారికి భార‌తి, జ‌య‌కృష్ణ అనే పిల్ల‌లున్నారు. తెలుగులో సూప‌ర్ హిట్ అయిన సూర్య‌వంశం సినిమాను ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ ద‌ర్శ‌క‌త్వంలో ఆ మూవీని నిర్మాత‌గా తెర‌కెక్కించారు ర‌మేష్‌. అర్జున్‌, అతిథి సినిమాల‌ను నిర్మాత‌గా తెర‌కెక్కించారు. దుర‌దృష్టం కొద్ది ఆ రెండు సినిమాలు న‌ష్టాలే మిగిల్చాయి. దూకుడు, ఆగ‌డు వంటి సినిమాలకు స‌మ‌ర్ప‌కుడిగా ఉన్నారు ర‌మేష్ బాబు. ర‌మేష్ బాబుకి ఉన్న ఏకైక కోరిక త‌న కొడుకు జ‌య‌కృష్ణ ని హీరోగా చూడ‌డం. గ‌త కొన్నాళ్లుగా కాలేయ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. దాదాపు న‌యం అయింద‌ని వైద్యులు చెప్పారు. హ‌ఠాత్తుగా శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బంది రావ‌డంతో ఏఐజీ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ర‌మేష్ బాబు గుండెపోటుతో మ‌ర‌ణించారు. కృష్ణ కొడుకుగా పుట్టిన ఆయ‌న‌కు ఏరంగం కూడా క‌లిసి రాలేదు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌య్యాయి. న‌ట‌న‌ను కొన‌సాగించి ఉంటే పెద్ద స్టార్ కాక‌పోయినా మంచి న‌టుడిగా మాత్రం టాలీవుడ్ లో ఉండేవారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  పిలిచి ఉద్యోగం ఇచ్చింది.. ఆ త‌రువాత అత‌నికి భార్య‌గా మారింది..!

 

Visitors Are Also Reading