Home » ఒకప్పుడు స్టార్ హీరో అవకాశాల్లేక అలాంటి పని చేస్తున్నాడా..?

ఒకప్పుడు స్టార్ హీరో అవకాశాల్లేక అలాంటి పని చేస్తున్నాడా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరికి స్టార్ డం వస్తుందో, ఎప్పుడు ఎవరు కనుమరుగై పోతారో చెప్పడం కష్టం. కొంతమంది హీరోలు ఓవర్ నైట్ లో స్టార్స్ అవుతారు..ఇంకొంత మంది చాలా తొందరగా ఇండస్ట్రీ నుంచి కూడా దూరం అవుతారు.. అలాంటి హీరోల్లో ఈ స్టార్ హీరో కూడా ఒకరు.. ఒకప్పుడు సినిమాలతో దూసుకుపోయారు.. తర్వాత కొద్ది రోజులకే ఎలాంటి అవకాశాలు లేక చివరికి సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యారు. ఇంతకీ ఆ హీరో ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. లాహిరి లాహిరి లాహిరి చిత్రంలో హీరోగా నటించినటువంటి ఆదిత్య అంటే ప్రతి ఒక్కరికీ తెలిసిన వ్యక్తి.. కానీ ఆయన ఇప్పటి వరకు తక్కువ సినిమాల్లో చేసిన గుర్తింపు మాత్రం చాలా వచ్చింది.

Advertisement

also rede:పిలిచి ఉద్యోగం ఇచ్చింది.. ఆ త‌రువాత అత‌నికి భార్య‌గా మారింది..!

ఆ తర్వాత ప్రేమించుకుందాం, పెళ్ళికి రండి, ధనలక్ష్మి ఐ లవ్ యు వంటి తదితర మూవీస్ లో నటించారు ఆదిత్య. ఆదిత్య ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు సినిమాల మీద ఉండే ఇంట్రెస్ట్ వల్ల తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. ఆ తర్వాత ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లారట.. డైరెక్టర్ గా కూడా చాలా సినిమాలు తీసి అవార్డు లు సొంతం చేసుకున్నారు ఆదిత్య. సినిమాల్లో హీరోగా నటించిన ఆదిత్య చాలా సినిమాలు ఫ్లాప్ అవడంతో అవకాశాలు తగ్గిపోయి కెరీర్ మొత్తం ముగిసిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులు ప్రొడక్షన్ వైపు కూడా వెళ్లారు ఆదిత్య. పలు సినిమాలకు ప్రొడక్షన్ మేనేజర్ గా కూడా పని చేస్తూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.

Advertisement

ఆదిత్య ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కానీ తెలంగాణలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ కొంతమంది పిల్లలకు లైబ్రరీ ఏర్పాటు చేశారు. విద్యాసంస్థల్లో మార్పు తీసుకురావడానికి సామాజిక సేవల్లో పాల్గొంటానని ఆయన తెలియజేశారు. అంతేకాకుండా అక్కడి విద్యార్థులకు సోలార్ లైట్లు, కంప్యూటర్లు కూడా అందించాడట ఆదిత్య. దీంతో ఈ విషయం తెలుసుకున్న కొంతమంది సినీ నటులు సైతం ఆదిత్య అభినందిస్తున్నారు. ఆయన ప్రస్తుతం అయితే సినిమా ఇండస్ట్రీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో మాత్రం ఒకప్పటి హీరో ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్నారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

also rede:భార్య పొర‌పాటున కూడా భ‌ర్త‌ను ఈ మాట‌లు అస్స‌లు అన‌కూడ‌దు..!

Visitors Are Also Reading