Home » కావ్య పాప బిగ్ స్కెచ్…SRH లోకి డేంజర్ ప్లేయర్లు..!

కావ్య పాప బిగ్ స్కెచ్…SRH లోకి డేంజర్ ప్లేయర్లు..!

by Bunty
Ad

ఐపీఎల్ 2023 వేలంలో ఆల్ రౌండర్లకు కాసుల పంట పండింది. రెండో సెట్లో ఆల్ రౌండర్లు వేలానికి రాగా, వారిని దక్కించుకోవడం కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి. దీంతో ఐపీఎల్ వేలంలో రికార్డులు బ్రేక్ అయ్యాయి. తమ దగ్గర పర్స్ తక్కువగా ఉన్నప్పటికీ, కామెరాన్ గ్రీన్, బెన్ స్టోక్స్ లను దక్కించుకోవడానికి ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ వెనుకాడలేదు.

Advertisement

ఇంగ్లాండ్ టి20 వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సామ్ కర్రన్, ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ యంగ్ సెన్సేషన్ హారీబ్రూక్ కోసం ఫ్రాంచైజీ లన్నీ పోటీపడ్డాయి. రూ. 10 కోట్లు దాటిన తర్వాత రాజస్థాన్ రాయల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు హారీబ్రూక్ కోసం పోటీ పడడంతో ధర అంతకంతకు పెరుగుతూ పోయింది.

Advertisement

చివరికి రూ. 13 కోట్ల 25 లక్షల భారీ మొత్తానికి హారీబ్రూక్ ని కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్. బేస్ ప్రైస్ రూ. 1.5 కోట్లతో మొదలైన హరిబ్రూక్, దాదాపు పది రేట్లు రెట్టింపు ధర దక్కించుకున్నాడు. భారత బ్యాట్స్మెన్ మయాంక్ అగర్వాల్ ని రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్.

READ ALSO : Kaikala Satyanarayana : కైకల యుముడిగా చేసిన సినిమాలు ఇవే

Visitors Are Also Reading