Home » Kaikala Satyanarayana : కైకల యుముడిగా చేసిన సినిమాలు ఇవే

Kaikala Satyanarayana : కైకల యుముడిగా చేసిన సినిమాలు ఇవే

by Bunty
Ad

ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన మృతికి సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు సానుభూతి తెలియజేస్తున్నారు. వందనాలు చిత్రాల్లో 60 ఏళ్లకు పైగా ప్రేక్షకులను కైకాల అలరించారు. విలనిజం, కరుణరసం, హాస్యం ఒకటేమిటి అన్ని రసాలను అద్భుతంగా చేసేవాడు.

Advertisement

అయితే ఆయా నటీనటులకు ఒక్కో సిగ్నేచర్ రోల్ ఉండటం కామన్. అలాగే తన జీవితంలో కూడా యముడి పాత్రను సిగ్నేచర్ రోల్ గా చేశాడు కైకాల. రాముడి, కృష్ణుడి పాత్రలు ఎన్టీఆర్ చేస్తే, యముడి పాత్రలు మాత్రం ఆయనే చేసేవాడు. తెలుగులో పలు సినిమాల్లో కైకాల సత్యనారాయణ యముడి పాత్రలు చేశాడు.

Advertisement

1977లో వచ్చిన యమగోల సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాతో ఎన్టీఆర్ కు ఎంత పేరు వచ్చిందో యముడిగా కైకాల సత్యనారాయణకు కూడా అంతటి పేరు వచ్చింది. 1998 లో వచ్చిన యముడికి మొగుడు అనే సినిమాతో కైకాల పోషించిన యముడు పాత్ర మరువలేనిది. ఆయుష్షు తీయకుండానే యమలోకానికి వెళ్లిన చిరు యముడికి చుక్కలు చూపించే సన్నివేశాలు జనాలను ఎంతో ఆకట్టుకున్నాయి.

ఇక ఎస్ వి క్రిష్ణారెడ్డి తిరకెక్కించిన యమలీలలో కూడా కైకాల పాత్ర అత్యద్భుతం. కమెడియన్ ఆలీ హీరోగా నటించిన ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డులను బద్దలు కొట్టింది. అలాగే యమగోల మళ్ళీ మొదలైంది చిత్రంలో కూడా యముడిగా ఆకట్టుకున్నారు.

ఇక తొట్టెంపూడి వేణు, శ్రీకాంత్ హీరోలుగా నటించిన యమగోల మళ్ళీ మొదలైంది లోను రిటైర్డ్ అయ్యే యముడి పాత్రలో కైకాల సత్యనారాయణ కనిపించారు. చివరగా ఆయన రవితేజ నటించిన దరువు చిత్రంలోను యముడి పాత్రలో మెప్పించారు.

READ ALSO : 18 Pages Review : ’18 పేజెస్‌’ మూవీ రివ్యూ..నిఖిల్‌ ఖాతాలో మరో సినిమా

Visitors Are Also Reading