Home » మీరు తీయ‌గ‌ల‌రు మేం చూడ‌గ‌లం అంతే…జ‌క్క‌న్న పై సుకుమార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం..!

మీరు తీయ‌గ‌ల‌రు మేం చూడ‌గ‌లం అంతే…జ‌క్క‌న్న పై సుకుమార్ ప్ర‌శంస‌ల వ‌ర్షం..!

by AJAY
Published: Last Updated on
Ad

టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ ల‌లో సుకుమార్ కూడా ఒక‌రు. సుకుమార్ రీసెంట్ గా పుష్ప సినిమాతో ప్రేక్ష‌కులను ఆక‌ట్టుక్కున్నారు. మొద‌ట ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ రాగా మెల్లి మెల్లిగా ఈ సినిమా సూప‌ర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌ను ఈ సినిమా ఎంత‌గానో అల‌రించింది. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా లెవ‌ల్ తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.

Advertisement

Advertisement

కాగా విడుద‌ల చేసిన అన్ని భాషల్లోనూ ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచింది. అయితే ఈ సినిమాను మొద‌ట సుకుమార్ కేవ‌లం తెలుగులోనే విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ ఈ సినిమా క‌థ బాగుంద‌ని పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేయాల‌ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి సూచించారు. ఇక జ‌క్క‌న్న ఈ సల‌హా ఈ సినిమాకు ఎంతో ప్ల‌స్ అయ్యింది.ఇదిలా ఉంటే ఇప్పుడు రాజ‌మౌళి హీరోగా న‌టించిన‌ ఆర్ఆర్ఆర్ విడుద‌లైన సంగ‌తి తెలిసిందే.

దాంతో ద‌ర్శ‌కుడు సుకుమార్ రాజ‌మౌళి పై ప్ర‌శంస‌లు కురిపించారు. సుకుమార్ త‌న సోష‌ల్ మీడియాలో.. మీరు ప‌క్క‌నే ఉన్నా మిమ్మ‌ల్ని అందుకోవాలంటే పరిగెత్తాలి. మేం ఆకాశంలో ఉన్నా మిమ్మ‌ల్ని చూడాలంటే త‌లెత్తాలి. రాజ‌మౌళి సార్ మీకు మాకు ఒక‌టే తేడా…ఇలాంటి సినిమా మీరు తీయ‌గ‌లరు. మేం చూడ‌గ‌లం అంతే.. అంటూ రాజ‌మౌళిపై పొగ‌డ్త‌లు కురిపించారు.

Visitors Are Also Reading