Home » Sudigali Sudheer : గెట‌ప్ శ్రీ‌ను ప్ర‌శ్న‌కు సుడిగాలి సుధీర్ ఏమి స‌మాధానం చెప్పారో తెలుసా..?

Sudigali Sudheer : గెట‌ప్ శ్రీ‌ను ప్ర‌శ్న‌కు సుడిగాలి సుధీర్ ఏమి స‌మాధానం చెప్పారో తెలుసా..?

by Anji
Ad

సుడిగాలి సుధీర్ ఇప్పుడు బుల్లితెర‌కు మెగాస్టార్‌గా మారాడు. ఎందరున్నా అందులో సుడిగాలి సుధీర్ ఉంటే ఆ కిక్కేవేరు అనేలా మారింది. అన్ని స్కిట్స్ కూడా దాదాపు సుడిగాలి సుధీర్ చుట్టే తిరుగుతుంటాయి. బ‌జ‌ర్ద‌స్త్ షోలో సుడిగాలి సుధీర్‌ను లా అమ్మాయిల పిచ్చోడిలా చిత్రీక‌రించ‌డం ఎన్నో సార్లు చూశాం. పార్టిసిపెంట్స్ మొద‌లు కొని, జ‌డ్జ్ రోజా వ‌ర‌కు అమ్మాయిల విష‌యం సుధీర్‌పై ప‌రోక్షంగా పంచులేయ‌డం కామ‌న్ అయింది. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ హోస్ట్‌గా ఉన్నా కూడా సుధీర్‌పై పంచ్‌లు పేలుతూనే ఉంటాయి. తాజాగా విడుద‌లైన ఎక్స్ ట్రా జ‌బ‌ర్ద‌స్త్ ప్రోమోలో క‌నిపించిన ఓ సీన్ చూసి అంతా ఆశ్చ‌ర్య‌పోయారు.

Also Read :  కిమ్ మ‌రో సంచ‌ల‌నం..పూలుపూయ‌లేద‌ని కూలీల‌కు దారుణ‌మైన శిక్ష‌..!

Advertisement

Advertisement

సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో గెట‌ప్ శ్రీ‌ను, సుధీర్ సంభాష‌ణ హైలైట్ అయింది వ‌చ్చే శుక్ర‌వారం ప్ర‌సారం కాబోతున్న ఎక్స్ స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుద‌లైంది. ఇందులో అన్ని టీమ్‌లు త‌మ స్కిట్ల‌తో తెగ సంద‌డి చేశాయి. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ బృందం చేసిన ర‌చ్చ అంతా ఇంతా కాదు. పంచ్‌ల‌తో ప్ర‌సాద్‌.. ప్ర‌త్యేక‌మైన మేన‌రిజంతో శ్రీ‌ను, త‌న‌దైన కామెడీతో సుధీర్ అల్ల‌రి చేయ‌డం ప్ర‌త్యేకంగా నిలిచింది. వ‌చ్చేవారం ఎపిసోడ్‌లో సుడిగాలి సుధీర్ టీమ్ చేసిన స్కిట్‌లో గెట‌ప్ శ్రీ‌ను సుధీర్ తో నేను ఇచ్చిన ఐదువేలు ఏమి చేశావ‌ని ప్ర‌శ్నిస్తాడు.

సుధీర్ దానికి ఇచ్చిన స‌మాధానం అంద‌రూ నోరెళ్ల‌పెట్టేలా చేసింది. ఆఫీస్ నుంచి వ‌స్తుంటే అమ్మాయి లిప్ట్ అడిగింది. ఇద్ద‌రం వెళ్లుతుండ‌గా.. పుల్ వ‌ర్షం వ‌చ్చింది. దీంతో హోట‌ల్ రూమ్ తీసుకుని నైట్ అంతా ఇద్ద‌రం బ‌ట్ట‌లు ఆర‌బెట్టుకున్నామంటూ ఊహించ‌ని విధంగా డైలాగ్‌లు చెప్పాడు. ఫ్యాన్స్ షాక్‌.. అలాంటివి వ‌ద్ద‌ని జ‌బ‌ర్ద‌స్త్ కమెడియ‌న్‌గా ఎన‌లేని గుర్తింపును సంపాదించుకున్న సుడిగాలి సుధీర్.. కొన్ని స్కిట్ల‌లో దిగ‌జారి త‌న‌పై తానే పంచ్‌లు వేసుకుంటున్నాడు. ఈ కామెంట్లపై ప‌లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

Also Read :  నిర్మలమ్మ పెళ్లి కోసం కాబోయే భర్తకు పెట్టిన కండిషన్ ఏమిటో తెలుసా..?

Visitors Are Also Reading