Home » సుధీర్ లేక‌పోవ‌డంతో ఢీ 14 టీఆర్పీ రేటింగ్ పై దెబ్బ‌..త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ..!

సుధీర్ లేక‌పోవ‌డంతో ఢీ 14 టీఆర్పీ రేటింగ్ పై దెబ్బ‌..త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ..!

by AJAY
Ad

బుల్లి తెర‌పై సంద‌డి చేస్తూ ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నవారిలో సుడిగాలి సుధీర్ కూడా ఒక‌రు. సుధీర్ జ‌బ‌ర్ద‌స్త్ టీవీ షో ద్వారా బుల్లితెర‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. త‌న కామెడీ టైమింగ్ తో ఎంతోమంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఇక ప్ర‌స్తుతం ఈటీవీలో ప‌లు టీవీ షోలు చేస్తూ అల‌రిస్తున్నాడు. అంతే కాకుండా యాంక‌ర్ గా కూడా సుధీర్ ఆక‌ట్టుకుంటున్నాడు. ఇక సుధీర్ గ‌త ఢీ సీజ‌న్ల‌లో ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఢీ 14లో మాత్రం సుధీర్ క‌నిపించ‌లేదు.

sudheer

sudheer

ఇక ఢీ 14 సీజ‌న్ లో సుధీర్ లేక‌పోవ‌డం ఆ షోపై ఎఫెక్ట్ ప‌డిన‌ట్టు క‌నిపిస్తోంది. సుధీర్ ఢీ 13లో సంద‌డి చేశారు. ఈ షోకు టీఆర్పీ రేటింగ్ చాలా వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. అంతే కాకుండా సుధీర్ వ‌స్తున్న ఎక్స్ట్రా జ‌బ‌ర్ద‌స్త్, శ్రీదేవి డ్రామా కంపెనీల‌కు టీఆర్పీ రేటింగ్ గ‌ట్టిగానే ఉంద‌ట‌. కానీ ఢీ 14 లో ఆయ‌న లేక‌పోవ‌డంతో టీఆర్పీ రేటింగ్ ప‌డిపోయిన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

Advertisement

also read: Bahubali-3 : బాహుబలి సిరీస్ కంటిన్యూ…పార్ట్ -3 పై జనవరి 1న ప్రకటన…!

ఢీ 13కు టీఆర్పీ రేటింగ్ చూసుకుంటే 5 ఉన్న‌ట్టు స‌మాచారం…అదే ఢీ 14లో టీఆర్పీ రేటింగ్ కేవలం 2.5 న‌మోదు అయిన‌ట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక టీఆర్పీ భారీగా ప‌డిపోవ‌డంతో నిర్వాహ‌కులు సుధీర్ రీఎంట్రీ కోసం ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో త్వ‌ర‌లోనే సుధీర్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నార‌ని మ‌ళ్లీ టీఆర్పీ పెరుగుతుంద‌ని ఆయ‌య అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఇందులో ఎంత‌వ‌ర‌కూ నిజం ఉందో తెలియాలంటే మాత్రం వెయిట్ చేయాల్సిందే.

Visitors Are Also Reading