Home » Bahubali-3 : బాహుబలి సిరీస్ కంటిన్యూ…పార్ట్ -3 పై జనవరి 1న ప్రకటన…!

Bahubali-3 : బాహుబలి సిరీస్ కంటిన్యూ…పార్ట్ -3 పై జనవరి 1న ప్రకటన…!

by AJAY
Ad

తెలుగు సినిమా ఖ్యాతిని ఒక స్థాయికి తీసుకెళ్లిన సినిమాలలో రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా దేశంలోనే టాలీవుడ్ ను టాప్ స్థానంలో నిలబెట్టింది.

baahubali-part-3

Advertisement

ఈ సినిమాతోనే పాన్ ఇండియా సినిమాలు కూడా మొదలయ్యాయి. ఇక బాహుబలి సినిమాకు జక్కన దర్శకత్వం వహించగా ప్రభాస్ హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క హీరోయిన్ గా నటించింది. రెండవ పార్ట్ లో తమన్నా హీరోయిన్ గా నటించి అలరించింది.

Bahubali part-3

Bahubali part-3

బాహుబలి ఫస్ట్ పార్ట్ తెలుగు కంటే బాలీవుడ్ మరియు ఇతర భాషల్లో సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో బాలీవుడ్ దిగ్గజాలు సైతం జక్కన్న తో పనిచేయాలని ఉందంటూ చెప్పుకొచ్చారు. ఇక ఫస్ట్ పార్ట్ లో బాహుబలి ఎలా చనిపోయాడో చూపించగా రెండో పార్ట్ లో బాహుబలి కుమారుడు ఏ విధంగా తన తండ్రిని చంపిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటాడు. తల్లిని ఎలా విడిపిస్తాడు… మళ్లీ రాజ్యాన్ని ఎలా ఆక్రమిస్తాడు అన్నది చూపించారు. అయితే తాజాగా బాహుబలి పార్ట్ -3 కూడా ఉంటుందని రాజమౌళి సంచలన ప్రకటన చేశారు. ఓ ఇంటర్వ్యూ లో రాజమౌళి మాట్లాడుతూ …బాహుబలి ప్రపంచంలో లో బాహుబలి సినిమా అనేది ఒక భాగమని అన్నారు.

Advertisement

also read : సుధీర్ లేక‌పోవ‌డంతో ఢీ 14 టీఆర్పీ రేటింగ్ పై దెబ్బ‌..త్వ‌ర‌లోనే రీ ఎంట్రీ..!

బాహుబలి ప్రపంచాన్ని కంటిన్యూ చేస్తామని చెప్పారు. బాహుబలి-3 కచ్చితంగా ఉంటుందని రాజమౌళి కన్ఫామ్ చేశారు. అయితే అదే ఇంటర్వ్యూలో రాజమౌళి తండ్రి బాహుబలి సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ…. బాహుబలి పార్ట్ 4,5,6 లు కూడా ఉంటాయని తనకు తెలుసు అంటూ ప్రకటించేశారు. దాంతో బాహుబలి సిరీస్ కంటిన్యూ అవుతూనే ఉంటుందని క్లారిటీ వచ్చేసింది. ఇది ఇలా ఉంటే జనవరి 1న బాహుబలి -3 పై అధికారిక ప్రకటన విడుదల చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అంతేకాకుండా మైత్రి మూవీ మేకర్స్ వారు బాహుబలి-3 ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

Visitors Are Also Reading