Home » యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సుధీర్ గాలోడు టీజర్…హైలెట్స్ ఇవే..!

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సుధీర్ గాలోడు టీజర్…హైలెట్స్ ఇవే..!

by AJAY
Ad

బుల్లితెర‌పై యాంక‌ర్లుగా మెరిసిన వారంతా ఇప్పుడు న‌టులుగా హీరోలుగా మారుతున్నారు. యంకర్ ర‌వి, ప్ర‌దీప్ మాచిరాజు, సుడిగాలి సుధీర్ ఇలా ప్ర‌తిఒక్క‌రూ సినిమాల్లో న‌టిస్తున్నారు. సుధీర్ ముందుగా మెజిషియ‌న్ గా త‌న కెరీర్ ను ప్రారంభించాడు. ఆ త‌ర‌వాత జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా క‌మెడియ‌న్ గా ప‌రిచ‌యం అయ్యాడు. జ‌బ‌ర్ద‌స్త్ లో త‌న కామెడీ టైమింగ్ మ‌రియు పంచుల‌తో సుధీర్ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Sudheer galodu teaser

Sudeer galodu teaser

ఆ తర‌వాత యాంక‌ర్ గానూ సుధీర్ షోలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నాడు. ఇదిలా ఉండ‌గానే సినిమాల్లో న‌టించ‌డ‌మే కాకుండా హీరోగానూ ప్ర‌య‌త్నాలు జ‌రుపుతున్నాడు. ఇప్ప‌టికే ప‌లు చిత్రాల్లో న‌టించిన సుధీర్ ప్ర‌స్తుతం గాలోడు సినిమాలో న‌టిస్తున్నాడు. అయితే ఇదివ‌ర‌కు సినిమాలు కామెడీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌గా గాలోడు మాత్రం మాస్ ఎలివెంట్స్ తో తెర‌కెక్క‌డం విశేషం.ఈ సినిమా పూర్తిస్థాయిలో మాస్ ఎంట‌ర్టైన‌ర్ గా తెర‌కెక్కింది.

Advertisement

Advertisement

Also read : మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే…సమ్మర్ లో రిలీజ్ ..!

ఈ చిత్రానికి రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కాగా తాజాగా ఈ సినిమా టీజ‌ర్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ టీజ‌ర్ లో మాస్ లుక్ లో సుధీర్ ఆక‌ట్టుకుంటున్నాడు. అంతే కాకుండా స్టార్ హీరో రేంజ్ లో ఈ టీజ‌ర్ లో సుధీర్ ను చూపించ‌డం హైలెట్ గా నిలిచింది. అదే విధంగా డైలాగు మ‌రియు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో టీజ‌ర్ ఆక‌ట్టుకునే విధంగా ఉంది. ఇక ప్ర‌స్తుతం ఈ టీజ‌ర్ యూట్యూబ్ లో టాప్ 10 ట్రెండింగ్ లో ఉంది. మ‌రి ఈ సినిమా అయినా సుధీర్ కు హిట్ ఇస్తుందో చూడాలి.

Visitors Are Also Reading