Home » మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే…సమ్మర్ లో రిలీజ్ ..!

మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా టైటిల్ ఇదే…సమ్మర్ లో రిలీజ్ ..!

by AJAY
Ad

మహేష్ బాబు కెరీర్ లో వచ్చిన బెస్ట్ సినిమాల్లో అతడు సినిమా కూడా ఒకటి. ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. 2005లో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో మహేష్ బాబు మ్యనరిజం, సెంటిమెంట్, మా సన్నివేశాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ చిత్రం తర్వాత మళ్లీ ఐదేళ్లకు 2010లో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబోలో ఖలేజా సినిమా వచ్చింది. ఈ సినిమా కమర్షియల్ హిట్ గా నిలవక పోయినప్పటికీ ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇక వీరి కాంబోలో మరో సినిమా చూడాలని మహేష్ బాబు అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.

Mahesh Babu trivikram movie

Mahesh Babu trivikram movie

ఇక రీసెంట్ గా వీరి కాంబోలో మూడో సినిమాపై కూడా ప్రకటన వచ్చింది. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ మహేష్ సినిమా రాబోతుందని ప్రకటించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ షురూ కానుందని సమాచారం. అయితే ఈ సినిమా పై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం అతడు మూవీకి సీక్వెల్ గా ఉండబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా ఈ సినిమా టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Advertisement

Also read : Ap tickets issue : నాని అలా సాయి కుమార్ ఇలా…ఇలా అయితే ఎలా…?

అతడు సినిమాలో మహేష్ బాబు పేరు పార్థు… పార్థసారథి కాగా మహేష్ త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాకు పార్ధు అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2022 సమ్మర్ ను టార్గెట్ చేసుకుని పూర్తి చేస్తారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో కూడా మహేష్ బాబు అతడు లో మాదిరిగా బుల్లెట్ లాంటి డైలాగులతో షార్ప్ గా కనిపించబోతున్నారని కూడా టాక్. ఇక ఇందులో ఇంతవరకూ నిజముందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Visitors Are Also Reading