Home » సుధీర్ నటించిన కాలింగ్ స‌హ‌స్త్ర టీజర్ విడుద‌ల‌

సుధీర్ నటించిన కాలింగ్ స‌హ‌స్త్ర టీజర్ విడుద‌ల‌

by Anji
Ad

జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షో హోస్ట్‌గా త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సుడిగాడి సుధీర్‌. ఇక వెండితెర‌పై కూడా త‌న మార్క్ చూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ మేర‌కు డిఫ‌రెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నారు. ఇప్ప‌టికే సుధీర్ న‌టించిన సాప్ట్‌వేర్ సుధీర్‌, 3 మంకిస్ వంటి సినిమాలు విడుద‌లై ప్రేక్ష‌కుల రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు కాలింగ్ స‌హ‌స్ర అనే డిఫ‌రెంట్ క్రైమ్ స్టోరీతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నారు సుడిగాలి సుధీర్‌.

Advertisement

తాజాగా ప్ర‌ముఖ నిర్మాత అల్లుఅరవింద్ చేతుల మీదుగా స‌హ‌స్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. చిత్ర యూనిట్ కు బెస్ట్ విషెష్ చెప్పారు అల్లు అర‌వింద్. ఒక నిమిషం 18 సెక‌నుల నిడివితో కూడిన ఈ టీజ‌ర్‌లో చూపించిన ప్ర‌తి సన్నివేశం కూడా సినిమాపై ఆస‌క్తి పెంచేసింది. ఈ ట్రైల‌ర్ చూస్తుంటే గ‌తంలో ఎన్న‌డూ చూడ‌ని స‌రికొత్త క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంద‌ని అర్థ‌మ‌వుతుంది. బ్ర‌తుక‌డం కోసం చంప‌డం సృష్టి ధ‌ర్మం. చంప‌డం త‌ప్పు కాన‌ప్పుడు దానిని చూపించ‌డం త‌ప్పు ఎలా అవుతుంది అనే డైలాగ్‌తో ప్రారంభ‌మైన ఈ ట్రీజ‌ర్ ఆద్యంతం మిస్ట‌రీని త‌ల‌పించింది. చివ‌ర‌గా చావు అంటే కేవ‌లం ప్రాణం పోవ‌డం కాదురా..? మ‌న క‌ళ్ల ముందు మ‌నం ప్రేమించిన వాళ్లు పోవ‌డం అంటూ ఈ మూవీలో ల‌వ్ ఆంగిల్ ఉంద‌ని చూపించారు.

Advertisement

రాధా ఆర్ట్స్ షాడో మీడియా ప్రొడ‌క్ష‌న్ సంయుక్త స‌మ‌ర్ప‌ణ‌లో రూపొందిన ఈ సినిమాకు బిజేష్‌కుమార్ త‌య‌ల్, చిరంజీవి కామెడీ, వెంకటేశ్వ‌ర్లు పాతూరి నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రించ‌గా అరుణ్ విక్కిరాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సుధీర్ ఆనంద్ భ‌యాన, శివ‌బాలాజీ, మ‌నోహ‌ర‌న్‌, డొలిషా, స్పంద‌న వ‌ల్లి, మ‌నాలీ రాథోడ్, ర‌వితేజ న‌న్నిమాల కీల‌క పాత్ర‌లు పోషించారు. మోహిత్ ర‌హ్మ‌ణియ‌క్ సంగీతం అందించారు.

Visitors Are Also Reading