Home » సుధా-నారాయణ మూర్తి లవ్ స్టోరీ..పెళ్లికి నో చెప్పిన తండ్రి.. పెళ్లి ఖర్చు కూడా..!

సుధా-నారాయణ మూర్తి లవ్ స్టోరీ..పెళ్లికి నో చెప్పిన తండ్రి.. పెళ్లి ఖర్చు కూడా..!

by Anji

ఇన్పోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేరు టెక్ ప్రపంచంలో తెలియని వారుండరు. ఆయన భార్య ప్రముఖ రచయిత్రీ, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కి రిటైర్డ్ చైర్ పర్సన్ సుధామూర్తి కూడా చాలా మందికీ ఇన్సిపిరేషన్, తాజాగా వీరిద్దరి లవ్ స్టోరీ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ గా మారింది.

నాలుగేళ్ల డేటింగ్ తరువాత 1978, ఫిబ్రవరి 10న నారాయణ, సుధామూర్తి మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అన్ని విషయాల్లో దూరదృష్టితో ఉండే నారాయణమూర్తి, బోళాగా, డబ్బు విషయంలో చాలా ప్రణాళికా బద్ధంగా ఉండే సుధ పరిచయం ప్రేమ విచిత్రంగా జరిగింది. కొన్ని భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ వారికీ ఒకరిపై మరొకరికి ఉన్న నమ్మకమే వారి ప్రేమను శాశ్వతం చేసింది. పూణేలో తమ కామన్ ఫ్రెండ్ విప్రో ప్రసన్న ద్వారా తామిద్దరం కలుసుకున్నామని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు సుధామూర్తి. 

ఒకరోజు పూణేలోని గ్రీన్ ఫీల్డ్స్ హోటల్ లో భోజనానికి ప్రసన్న ద్వారా సుధ, ఆమె స్నేహితులను నారాయణ ఆహ్వానించారు. వీరందరిలో ఆమె ఒక్కతే ఆడపిల్ల కావడంతో తొలుత వెళ్లేందుకు ఇష్టపడలేదు. కానీ నారాయణ ఆమెను ఒప్పించారట. ఆ సమయంలో ప్రసన్న దగ్గర నుంచి చాలా పుస్తకాలను తీసుకునేవారట సుధ.  పుస్తకాలపై ఎక్కువగా నారాయణ మూర్తి పేరు ఉండేదట. తన మనస్సులో నారాయణ ఊహాచిత్రం ముందే ఉండేదంటూ గుర్తు చేసుకున్నారు. అలా వీరి మధ్య ప్రేమ చిగురించింది.  రీసెర్చ్ అసిస్టెంట్ గా పని చేస్తున్న నారాయణమూర్తి తొలుత వీరిద్దరి పెళ్లిని సుధ తండ్రి వ్యతిరేకించాడు.

ఆ సమయంలో జీవితంలో ఏం కావాలనుకుంటున్నారని సుధ తండ్రి అడిగితే.. కమ్యూనిస్టు పార్టీలో నాయకుడిగా ఎదగాలని, అనాథ ఆశ్రమాన్ని తెరవాలనుకుంటున్నానని చెప్పారట మూర్తి. చివరికి 1977లో నారాయణ మూర్తి పాట్నీ కంప్యూటర్ లో జనరల్ మేనేజర్ గా జాయిన్ అయిన తరువాతనే ఆయన పెళ్లికి అంగీకరించారట. పెళ్లిలో తనకు తొలి పట్టు చీర వచ్చిందని గుర్తుకు చేసుకున్నారు. అప్పట్లో తమ పెళ్లి ఖర్చును ఇద్దరం సమానంగా పంచుకున్నామని వెల్లడించారు సుధామూర్తి. పెళ్లి ఖర్చు మొత్తం 800 కాగా..  రూ.400 చొప్పున పంచుకున్నట్టు తమ పాత జ్ఞాపకాలను వెల్లడించారు.

Visitors Are Also Reading