Home » ఉక్కిరిబిక్కిరవుతున్న ఇన్వెస్ట‌ర్లు.. గంట‌కొక కొత్త ట్విస్ట్‌..!

ఉక్కిరిబిక్కిరవుతున్న ఇన్వెస్ట‌ర్లు.. గంట‌కొక కొత్త ట్విస్ట్‌..!

by Anji
Published: Last Updated on
Ad

తొలి ఏడాది మొద‌టి చివ‌రి రోజు ఇన్వెస్ట‌ర్ల‌కు స్టాక్ మార్కెట్ చుక్క‌లు చూపిస్తోంది. క్ష‌ణానికే లాభ‌న‌ష్టాల మ‌ధ్య అటు ఇటు మారుతూ ప‌ల్స్ రేటు పెంచుతోంది. ముఖ్యంగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న వారు అయితే బీపీ మాత్ర‌లు వేసుకోవాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

Stock Market Indices Fluctuating Between Loss and Profits - Sakshiగ‌త నెల అయిన డిసెంబ‌ర్‌లో బేర్ ప‌ట్టులో చిక్కుకుంది స్టాక్ మార్కెట్‌. దీంతో జీవిత కాల గ‌రిష్టాల‌ను క్ర‌మంగా కోల్పోతూ వ‌చ్చింది. బీఎస్ఈ సెన్సె క్స్ 62,245 పాయింట్ల నుండి క్ర‌మంగా పాయింట్లూ కోల్పోతూ డిసెంబ‌ర్ 20 ఏకంగా 55, 822 పాయింట్ల‌కు ప‌డిపోయింది. మ‌రొక వైపు నిఫ్టిమొత్తం సైతం 18,604 పాయింట‌లు గ‌రిష్టాన్ని అందుకున్న‌ది. కానీ క్ర‌మంగా పాయింట్లు కోల్పోతూ 16614కు ప‌డిపోయిన‌ది. డిసెంబ‌ర్ అంతా న‌ష్టాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్ జ‌న‌వ‌రి 03న ప్రారంభ‌మై.. అదే ఊపు కొన‌సాగించ‌లేక 06న న‌ష్టాల‌తో ముగిసింది.

Advertisement

What do stock market fluctuations mean for the economy?

Advertisement

జ‌న‌వ‌రి 07 మార్కెట్ ఉద‌యం లాభాల‌తో మొద‌లైంది. బీఎస్ఈ  సూచి క్ర‌మంగా లాభ‌ప‌డుతూ పాయింట్లు పెరుగుతూ పోయింది. ట్రెడింగ్ ప్రారంభ‌మైన గంట‌కే దాదాపు 400 పైగా పాయింట్లు లాభ‌ప‌డి 60వేలు క్రాస్ చేసి ఈరోజు గ‌రిష్టం 60,130 పాయింట్ల‌ను ట‌చ్ చేసింది. దీంతో వెంట‌నే ఇన్వెస్ట‌ర్లు త‌క్ష‌ణ లాభాలు తీసుకునేందుకు ఆస‌క్తి చూపించ‌డంతో వేగంగా పాయింట్లు కోల్పోవ‌డం ప్రారంభించింది. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో ఆరంభ లాభాలు మొత్తం ఆవిరి చేస్తూ దాదాపు 500ల‌కు పైగా పాయింట్లు కోల్పోయి 59,401 పాయింట్ల‌కు ప‌డిపోయింది. ఇంచు ఇదే ట్రెండ్ నిప్టీలోనూ క‌నిపించింది. నిప్టీ 17,905 గ‌రిష్టం నుంచి 17,704 పాయింట్ల‌కు ప‌డిపోయింది.

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల త‌రువాత మార్కెట్ మ‌రొకసారి పుంజుకోవ‌డం ప్రారంభించింది. స్టాక్స్ ధ‌ర అందుబాటులో ఉండ‌టంతో ఇన్వెస్ట‌ర్లు మ‌రొక‌సారి మార్కెట్ పై న‌మ్మ‌కం చూపించారు. దీంతో క్ర‌మంగా సెన్సె క్స్, నిఫ్టీలు పుంజుకుని న‌ష్టాల నుంచి బ‌య‌ట‌ప‌డ్డాయి. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల స‌మయంలో నిఫ్టి 45 పాయింట్లు లాభ‌ప‌డి 17,791 వ‌ద్ద ట్రేడ‌వుతుంది. సెన్సె క్స్ 67 పాయింట్లు 59,668 ద‌గ్గ‌ర కొన‌సాగుతుంది. క్ష‌ణానికి ఆధిప‌త్యం మారుతుండ‌డంతో ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఉన్న ఇన్వెస్ట‌ర్లు తీవ్ర ఉత్కంఠ‌కు లోను కావ‌డం విశేషం.

Visitors Are Also Reading