Home » బాలీవుడ్ కి చమటలు పట్టించిన మెగా స్టార్ సినిమా అది ! కలెక్షన్స్ చూసి అమితాబ్ ఏమన్నారంటే ?

బాలీవుడ్ కి చమటలు పట్టించిన మెగా స్టార్ సినిమా అది ! కలెక్షన్స్ చూసి అమితాబ్ ఏమన్నారంటే ?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి సినీ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ల‌లో స్టేట్ రౌడీ సినిమా ఒకటి అని తెలిసిందే. రాధా, భానుప్రియ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించగా బి. గోపాల్ సినిమాకి దర్శకత్వం వహించాడు. మహేశ్వరి పరమేశ్వరి ప్రొడక్షన్ బ్యానర్ పై డి సుబ్బిరామిరెడ్డి ఈ సినిమాను నిర్మించగా పబ్బి లహరి ఈ సినిమాకి సంగీతం అందించారు. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంది అప్పట్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో మొదట ప్రేక్షకుల నుంచి డిజాస్టర్ టాక్ వచ్చింది.

Also Read :  రాధే శ్యామ్ సినిమాపై గోగినేని సంచలన వ్యాఖ్యలు….తుస్ అంటూ పరువు తీశాడుగా…!

Advertisement

అయితే ఈ సినిమాకు తొలుత‌ కోదండరామిరెడ్డి దర్శకుడిగా ఎంపికైన కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్టుకు డైరెక్షన్ చేసే చాన్స్ బీ.గోపాల్ కు దక్కింది. సుబ్బిరామిరెడ్డి చిరంజీవితో నిర్మించిన ఏకైక మూవీ స్టేట్ రౌడీ కావడం గమనార్హం. 1989 మార్చి 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. నైజాం బ‌య్యర్లు బ్లాంక్ చెక్ లు ఇచ్చి ఈ సినిమా హక్కులను కొనుగోలు చేయాల‌ని అప్పట్లో ప్రయత్నాలు చేశారు. సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినా కానీ తొలి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్ల ఈ విషయంలో రికార్డులు క్రియేట్ చేసుకుంది. ఈ సినిమా నైజాంలో కోటి రూపాయల కలెక్షన్లు సొంతం చేసుకుంది.

Advertisement


ఈ సినిమా విడుద‌ల‌య్యే సమయానికి అమితాబచ్చన్ ఆల్ ఇండియా స్టార్ గా ఉన్నారు. అయితే ఆయన సినిమాలను మించి చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ కళ్ళు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోవడం బాలీవుడ్ సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సమయంలో ట్రేడ్ గైడ్ అనే బాలీవుడ్ మాక్సిన్ చిరంజీవి నటించిన స్టేట్ రౌడీ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రచురించి చిరంజీవి సినిమా కలెక్షన్లతో పోలిస్తే అమితాబ్ సినిమాను వేర్ ఇస్ అమితాబ్ అని ప్రశ్నిస్తూ ఆర్టికల్ రాసింది. అలా ఈ సినిమా వసూళ్లతో అటు బాలీవుడ్ లో కూడా మారుమోగిపోయింది. మొదటిరోజు ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా రన్నింగ్ లో ఎంతో సక్సెస్ ఫుల్ గా వంద రోజులు చేసుకొని చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ల‌లో ఒక‌టిగా నిలిచింది.

Also Read :  గ్రీన్ ఇండియ‌న్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

Visitors Are Also Reading