Home » గ్రీన్ ఇండియ‌న్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

గ్రీన్ ఇండియ‌న్ ఛాలెంజ్‌లో పాల్గొన్న ఆర్జీవీ

by Anji
Ad

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పాపుల‌ర్ అయింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, సినీ ప్ర‌ముఖులు, జ‌ర్న‌లిస్టులు ఇలా ప‌లువురు ఇందులో పాల్గొని మొక్క‌లు నాటుతున్నారు. తాజాగా ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ ఆదివారం శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో రాజ్య‌స‌భ ఎంపీ జోగిన‌ప‌ల్లి సంతోష్‌కుమార్ చేప‌ట్టిన గ్రీన్ ఇండియ‌న్ ఛాలెంజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొని మొక్క‌ను నాటారు.

Advertisement

Advertisement

జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న నుంచి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన‌డానికి నామినేష‌న్‌ను అంగీక‌రించిన రామ్ గోపాల్ వ‌ర్మ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న‌తో క‌లిసి శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ప‌బ్లిక్ పార్కును సంద‌ర్శించిన వ‌ర్మ ఈరోజు ఉద‌యం మొక్క‌ను నాటారు. అనంత‌రం జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప్న ట్విట్ట‌ర్‌లో వ‌ర‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపింది. ఎంపీ సంతోష్‌కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు స‌హ‌క‌రించిన రామ్‌గోపాల్ వ‌ర్మ‌కు ధ‌న్య‌వాదాలు ట్వీట్ చేసింది.

Visitors Are Also Reading