Home » Telugu Movies: షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు ఇవే!

Telugu Movies: షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన స్టార్ హీరోల సినిమాలు ఇవే!

by Sravya
Ad

ఏదైనా కొత్త సినిమాని అనౌన్స్ చేస్తే ఫాన్స్ విపరీతంగా ఆ సినిమాల అప్డేట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈ సినిమాల కోసం ఎదురుచూసే వాళ్ళందరికీ బాడ్ న్యూస్ అని చెప్పాలి. హరిహర వీరమల్లు సినిమా మొదలు మొత్తం పది సినిమాలు ఇప్పుడు హోల్డ్ లో ఉన్నాయి అలా హోల్డ్ లో ఉన్న ఆ సినిమాలు గురించి ఇప్పుడు చూద్దాం.

జె జి ఎం:

Advertisement

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రెండవ సినిమాగా జెజిఎం(జన గణ మన) ని అనౌన్స్ చేశారు. ఛార్మీ ఈ సినిమాని నిర్మించాలని అనుకున్నారు కూడా. అయితే లైగర్ మూవీ రిజల్ట్ అలా ఉండడంతో మూవీ హోల్డ్ లో పడింది.

కొరటాల, అల్లు అర్జున సినిమా:

కొరటాల, అల్లు అర్జున కాంబినేషన్లో కూడా సినిమా రావాలి. 2021 సమ్మర్లో అనౌన్స్ చేశారు. ‘యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ ఈ సినిమాని నిర్మించాల్సి ఉంది. కానీ హోల్డ్ లో పడింది.

ఐకాన్:

అల్లు అర్జున్, దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబినేషన్లో ఈ ప్రాజెక్టు కూడా అనౌన్స్ చేసారు కానీ హోల్డ్ లోనే వుంది.

హరిహరవీరమల్లు:

పవన్ కళ్యాణ్, క్రిష్ కాంబినేషన్లో ఈ పాన్ ఇండియా సినిమా రావాలి. అయితే ఇది పాన్ ఇండియా మూవీ కనుక లేట్ అవుతోందట.

Advertisement

అహం బ్రహ్మాస్మి:

Manchu Manoj

Manchu Manoj

మంచు మనోజ్ శ్రీకాంత్ ఎన్ రెడ్డి సినిమా రావాల్సి ఉంది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీ కూడా హోల్డ్ లోనే వుంది.

విజయ్, గౌతమ్ తిన్ననూరి మూవీ:

సితార ఎంటర్టైన్మెంట్స్ అనౌన్స్ చేశారు. శ్రీలీల హీరోయిన్ అన్నారు. కానీ మూవీ ని హోల్డ్ లో ఉంచారు.

నిఖిల్, సుధీర్ వర్మ సినిమా:

NIKHIL

NIKHIL

నిఖిల్, సుధీర్ వర్మ సినిమా కూడా రావాల్సి వుంది. కానీ దీన్ని కూడా హోల్డ్ లో పెట్టేసారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ:

సినిమా కూడా రావాల్సి వుంది. కానీ దీన్ని కూడా హోల్డ్ లో పెట్టేసారు.

వెంకటేష్, తరుణ్ భాస్కర్ సినిమా:

వెంకటేష్, తరుణ్ భాస్కర్ సినిమా కూడా రావాలి. కానీ ఇంకా సెట్స్ మీద కి రాలేదు. హోల్డ్ లో ఉంచేశారు.

ఆర్.టి.జి.ఎం 4 :

రవితేజ, గోపీచంద్, మైత్రి కాంబోలో ఈ మూవీ రావాలి. కానీ, హోల్డ్ లో పడింది.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading