Home » ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు షాకిచ్చిన తమిళనాడు సర్కార్.. నోటీసులు ఎందుకు పంపారంటే?

ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు షాకిచ్చిన తమిళనాడు సర్కార్.. నోటీసులు ఎందుకు పంపారంటే?

by Srilakshmi Bharathi

నటులు ప్రకాష్ రాజ్, బాబీ సింహాలకు కొడైకెనాల్ జోనల్ డిప్యూటీ బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ నోటీసులు పంపించారు. కొడైకెనాల్‌లోని విల్‌పట్టి పంచాయితీలోని ప్రభుత్వ భూమిని బంగ్లాల నిర్మాణం కోసం ఆక్రమించారనే ఆరోపణలపై వివరణ కోరుతూ ఈ నోటీసులను పంపారట. విల్పట్టి పంచాయతీ పరిధిలోని పెతుపరై మరియు భారతీపురం అన్నానగర్ సమీపంలోని ప్రభుత్వ భూమిని తమ బంగ్లాల నిర్మాణం కోసం నటులు ప్రకాష్ రాజ్ మరియు బాబీ సింహా ఆక్రమించారని పెతుపరై గ్రామ అధ్యక్షుడు కెవి మహేంద్రన్ ఆరోపించారు.

ఇద్దరు నటులు సంబంధిత అధికారుల నుండి అనుమతి పొందకుండానే బంగ్లాలు నిర్మించారని, పబ్లిక్ రోడ్డును ఆక్రమించారని, దారులు నిర్మించారని, దీనివల్ల నివాసితులు రహదారిని ఉపయోగించకుండా అడ్డుకున్నారని ఆయన తన పిటిషన్‌లో ఆరోపించారు. దీంతో గురు, శుక్రవారాల్లో దేవాదాయ శాఖ అధికారులు ఇరువురి భూములను పరిశీలించారు. కొడైకెనాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా మాట్లాడుతూ, తహశీల్దార్ మరియు సర్వేయర్ నటీనటుల భూములను పరిశీలిస్తున్నారని, తనిఖీ పూర్తయిన తర్వాత అవసరమైన చర్యలు తీసుకుంటామని కొడైకెనాల్ రెవెన్యూ డివిజనల్ అధికారి రాజా తెలిపారు. ప్రస్తుతం వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

ఇద్దరు నటుల భూములు పంచాయతీ పరిధిలోకి వస్తాయో లేదో నిర్ధారించడానికి TNIE విల్పట్టి పంచాయతీ ప్రెసిడెంట్ పాకియలక్ష్మి రామచంద్రన్‌ను సంప్రదించడానికి ప్రయత్నించింది.  ఆమె తరపున మాట్లాడిన భర్త రామచంద్రన్ మాట్లాడుతూ నటుడు బాబీ సింహ భూమి తల్లిదండ్రులు కృష్ణకుమారి, రామకృష్ణన్‌ల పేర్లపై ఉందని తెలిపారు. ఇది పెతుపరై గ్రామ పరిధిలోకి వచ్చే పట్టా భూమి అంటూ పేర్కొన్నారు.

2021లో ప్రత్యేక అధికారి హయాంలో 2,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించేందుకు ఆమోదం పొందారు. అయితే, ఆ తర్వాత తమ అనుమతిని పునరుద్ధరించి 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించారని అన్నారు. నటుడు ప్రకాష్ రాజ్‌కు కూడా భారతీపురం అన్నానగర్ గ్రామంలో పట్టా భూమి ఉందని, అక్కడ పంచాయతీ అనుమతి లేకుండా తన బంగ్లాను నిర్మించారని ఆయన అన్నారు. సంబంధిత అధికారులు ఇరువురు నటీనటులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఏడు రోజుల్లో ప్లాన్ డ్రాయింగ్‌తో పాటు వారి ఉల్లంఘనలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇద్దరు నటులకు నోటీసు జారీ చేసినట్లు ఆయన చెప్పారు. వారి సమాధానం తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Visitors Are Also Reading