బిగ్ బాస్ కంటెస్టెంట్ నటి శ్రీ నిత్య గురించి ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఈ సీజన్ లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టిన ఆమె తనదైన తీరుతో రాణిస్తోంది. టాస్క్ లో చురుకుగా ఉండకపోయినా, ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. అయితే హౌజ్ లో అందరితో కలవకపోవడం, తనకంటూ ఓ పరిధిని పెట్టుకున్న శ్రీ నిత్య దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో ఇటీవల సిసింద్రీ టాస్క్ లో బయట పెట్టిన సంగతి తెలిసిందే. ఇలా వ్యవహరించడానికి కారణం తనకు ఎదురైన కొన్ని చేదు అనుభవాలు అని చెప్పింది.
తనకు బ్రేకప్ స్టోరీ ఉందని, ప్రేమించిన వ్యక్తి మోసం చేశాడంటూ ఆమె వాపోయింది. దీంతో తాను మరణించడానికి కూడా ప్రయత్నం చేశానంటూ షాకింగ్ విషయం చెప్పింది. ఈ ఘటనతో మనోవేదనకు గురైన వాళ్ళ అమ్మ ప్రస్తుతం అస్వస్థతకు గురైంది అని తను ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇదిలా ఉండగా.. తనపై తప్పుడు ఆరోపణలు చేసిందని అంటున్నారు ఆమె మాజీ ప్రియుడు పవన్ రెడ్డి. శ్రీ సత్యను తాను మోసం చేయలేదని, అలాంటి ఉద్దేశం ఉంటే తనతో నిశ్చితార్థం పెళ్లి వరకు ఎందుకు వస్తానంటూ పవన్ రెడ్డి తన స్నేహితులతో చెప్పుకుని మండిపడ్డాడని సమాచారం.
Advertisement
Advertisement
Also Read : బాలయ్య అన్‌స్టాపబుల్ షోకి పవన్ రాకపోవడానికి అసలు కారణం అదేనా..?
బిగ్ బాస్ వంటి పెద్ద షోలో శ్రీ నిత్య తనని బ్యాడ్ ప్రోజెక్ట్ చేయడం పవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశాడని తెలుస్తోంది. మరోవైపు బిగ్ బాస్ హౌజ్ లో అడుగు పెట్టడానికి ముందు ఓ యూట్యూబ్ ఛానల్ లో ముచ్చటించిన శ్రీ నిత్య బ్రేకప్ పై స్పందించింది. టీనేజ్ లో ఉన్నప్పుడు పవన్ రెడ్డి అనే వ్యక్తి నిప్రేమించానని, అయితే ఆ రిలేషన్ ఇప్పుడు బ్రేకప్ అయ్యిందని తెలిపింది. ప్రేమించిన వ్యక్తితోనే నిశ్చితార్థం జరిగింది. అయితే మొదటి నుంచే మా ఇరు కుటుంబాలకు పెళ్లి ఇష్టం లేదు. మా ప్రేమను వారు అంగీకరించలేదు. ఈ క్రమంలో రెండు కుటుంబాల మధ్య కొన్ని మనస్పార్థాలు వచ్చాయి. అందుకే మా నిశ్చితార్థం రద్దయింది అని ఆమె చెప్పుకొచ్చింది.
Also Read : టిక్ టాక్ లో పరిచయమైన యువతితో భర్తకు రెండో పెళ్లి జరిపించిన భార్య..!