Telugu News » Blog » బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకి ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి అసలు కార‌ణం అదేనా..?

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోకి ప‌వ‌న్ రాక‌పోవ‌డానికి అసలు కార‌ణం అదేనా..?

by Anji
Ads

గత కొద్ది రోజులుగా బాలయ్య హోస్ట్‌గా చేస్తున్నా అన్ స్టాపబుల్ -2 షో ప్రారంభం అవుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కనిపించబోతున్నట్లుగా కూడా వార్తలు వినిపించ‌డం విశేషం. అయితే బాలయ్య, పవన్ కళ్యాణ్ ఓకే స్క్రీన్ పై చూడబోతున్నామని ఆయన అభిమానులు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అయితే బాలయ్యకు పవన్ కళ్యాణ్ హ్యాండ్ ఇచ్చారనే ఓ వార్త తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. అన్ స్టాపబుల్ -2షోకి పవన్ హాజరు కాలేకపోతున్నట్టు స‌మాచారం.

Ads

అయితే పవన్ కళ్యాణ్ హాజరు కాలేకపోవడానికి గల కారణాలు మాత్రం తెలియడం లేదు.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికాలో ఉన్నారు. ఇంకా పది రోజుల వ‌ర‌కు పవన్ కళ్యాణ్ అక్కడే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ కి కూడా ప‌వ‌న్‌ని ఆహ్వానించార‌ట‌. కానీ ప‌వ‌న్ వ‌స్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది. అందుకోస‌మే పవన్ కళ్యాణ్ ఈ షోకు హాజరు కావ‌డం లేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఈ షోకి పాల్గొనడానికి ఆసక్తి చూపని నేపథ్యంలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పాల్గొనడానికి ఆసక్తి చూపిస్తారో లేదో అనే విషయం పై ఆహా సంస్థ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

Ads

Also Read :  “హనుమాన్ జంక్షన్” సినిమా ను మిస్ చేసుకున్న టాలీవుడ్ స్టార్స్ ఎవరో తెలుసా..? అడ్వాన్స్ తీసుకుని మరీ ఎందుకు రిటర్న్ ఇచ్చారంటే ..?

ఈ విషయం తెలిసిన అభిమానులు సైతం కాస్త నిరుత్సాహ పడుతున్నాతున్నట్లుగా తెలుస్తోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ సినిమా సినిమాకు తన రేంజ్ ను పెంచుకుంటూ వెళుతున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరి హర వీరమ‌ల్లు సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ క్రిష్ ఎంతో ప్రతిష్టాత్మాకంగా తెరకేక్కిస్తున్నారు. ఇందులో క‌థానాయిక‌గా నిధి అగర్వాల్ న‌టించ‌నున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటికే తన చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఈ సినిమాల‌కు సంబంధించి షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. మ‌రోవైపు హ‌రిహ‌ర‌వీర‌మ‌ల్లు షూటింగ్ అక్టోబ‌ర్‌లో ప్రారంభం కానున్న‌ట్టు ఇటీవ‌ల చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.

Ad

Also Read :  స్టార్ అవ్వాల్సిన గిరిబాబు కొడుకు చిరంజీవి వ‌ల్ల ఎద‌గ‌లేక‌పోయాడా..? అస‌లేం జ‌రిగింది..?