వివాదాస్పద నటి శ్రీరెడ్డి వైసీపీ కండువా కప్పుకోకపోయినా సోషల్ మీడియా వేదికగా తన పూర్తి మద్దతు తెలుపుతున్న అన్న సంగతి తెలిసిందే. జగనన్న అంటూ ఎంతో ఆప్యాయంగా పిలుస్తూ వైసిపి తన పార్టీ అని చెప్పుకుంటూ వీడియోలు చేస్తుంది. ప్రతిపక్షంలో ఎవరు ఏం మాట్లాడినా…. శ్రీరెడ్డి తనదైన స్టైల్ లో కౌంటర్ ఇస్తుంది. అయితే తాజాగా మాత్రం శ్రీరెడ్డి వైసీపీపై అసహనం వ్యక్తం చేస్తూ వీడియో చేసింది.
ఇవి కూడా చదవండి : ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!
Advertisement
ఆ వీడియోలో శ్రీరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పార్టీలకు సపోర్ట్ చేస్తే డబ్బులు వస్తాయని కొందరు అనుకుంటారని… కానీ ఒక్క రూపాయి కూడా రావన్న సంగతి వాళ్లకు తెలియదని చెప్పింది. పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను మర్చిపోకూడదని శ్రీరెడ్డి వ్యాఖ్యానించింది. తన ఊరిలో తన తండ్రి తాను కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి గుడిని ప్రారంభించినట్టు శ్రీరెడ్డి తెలిపింది. గుడి కోసం టీడీపీ హయాంలో నిధులు విడుదల అయ్యాయని చెప్పింది.
Advertisement
కానీ వైసిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా నిధులు విడుదల కాలేదని తెలిపింది. తాను ఎంతో మంది మంత్రులు, ఎమ్మెల్యేలను సంప్రదించాలని అయినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో మా దేవుడు బయటే ఉన్నాడని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. నిధుల కోసం తాను ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినట్టు తెలిపింది. తన తండ్రి ఆ గుడి కోసం పగలనకా రాత్రనకా కష్టపడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.. అందరూ పార్టీలు తెచ్చిపెడతాయని అనుకుంటారు…. కానీ మనం ఏమైనా ఇస్తేనే గుర్తింపు పార్టీలు గుర్తింపు ఇస్తాయని తెలిపింది.
ఇవి కూడా చదవండి : సీనియర్ ఎన్టీఆర్ ను అభినందిస్తూ దినపత్రికలో కృష్ణ ఇచ్చిన ప్రకటన ఏంటో మీకు తెలుసా..?
వెంకటేశ్వర స్వామి గుడి విషయంలో తనకు అన్యాయం జరిగిందని….అలా అన్యాయం జరుగుతుందని తాను ఎప్పుడూ అనుకోలేదని చెప్పింది. ఈ విషయంలో తాను హర్ట్ అయ్యానని వెల్లడించింది. ఇన్నాళ్లు పార్టీని నమ్ముకుని ఒక్క రూపాయి కూడా తినక పోగా కనీసం గుడిని కూడా పట్టించుకో లేకపోయాను అని తెలిపింది. తన పరిస్థితి ఎవరికి చెప్పుకోను అంటూ ఎమోషనల్ అయ్యింది.
Also Read: మిథాలీ రాజ్ ఆస్తులు విలువ ఎంతో మీకు తెలుసా..?