Home » ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!

ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!

by AJAY
Ad

సినిమాల్లో స్టార్ హీరోయిన్ గా రాణించి అతి చిన్నవయసులోనే ఇండస్ట్రీ కి దూరమైన హీరోయిన్ లలో అందాలతార దివ్య భారతి కూడా ఒకరు. బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో దివ్య భారతి నటించి అలరించింది. బాలీవుడ్ లో దివానా, రంగ్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన దివ్య భారతి టాలీవుడ్ లో అసెంబ్లీ రౌడీ, రౌడీ అల్లుడు, ధర్మ క్షేత్రం లాంటి సినిమాల్లో నటించి ఫ్యాన్స్ ను సంపాదించుకుంది.

ఇవి కూడా చదవండి: పెళ్లి తరువాత పిల్లల విషయంలో ఆలస్యం చేసేవారికి వచ్చే సమస్యలు ఇవేనని తెలుసా ?

Advertisement

 

అప్పటి హీరోయిన్లలో దివ్య భారతి అంతా అంద గత్తెలు లేరు. అంతే కాకుండా అతిచిన్న వయసులోనే దివ్యభారతి సినిమాల్లో రాణించింది. అదే విధంగా కేవలం 19 ఏళ్ల వయసులోనే దివ్య భారతి ఈ లోకానికి దూరం అవ్వడం బాధాకరం. అయితే దివ్య భారతి ఎలా చనిపోయింది అన్న దానిపై మాత్రం ఇప్పటి వరకూ సరైన క్లారిటీ లేదు. కోర్టు కూడా ఆమె కేసులో సరైన తీర్పు ఇవ్వకుండానే 1998 లో కేసును క్లోజ్ చేసింది.

ఇవి కూడా చదవండి: 

టీవీ షోలు చేసి నాగబాబు ఇన్ని కోట్లు సంపాదించారా.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..?

Advertisement

దివ్యభారతి తన భర్త సాజిత్ తో కలిసి ముంబై లోని ఒక అపార్ట్ మెంట్ లో ఉండేది. చనిపోయిన రోజు దివ్యభారతి షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చింది. అదే రోజు తన పేరెంట్స్ కోసం ఒక ఇంటిని కూడా కొనుగోలు చేసింది. అన్నిపనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న దివ్య భారతి తన మేకప్ ఆర్టిస్ట్ కు ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. మేకప్ ఆర్టిస్ట్ తో పాటు ఆమె భర్త కూడా వెంట వచ్చాడు. ఆ తరవాత అందరూ కలిసి మద్యం సేవించారు. అప్పటి వరకు వాళ్లతో మాట్లాడిన దివ్య భారతి ఉన్నట్టుండి బాల్కనీ నుండి పడిపోయింది.

రక్తపు మడుగులో ఉన్న ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే కన్నుమూసింది. అయితే ఆమె మరణం పై భర్త సాజిత్ కానీ అక్కడే ఉన్న మేకప్ ఆర్టిస్ట్ గానీ నోరు విప్పలేదు. మరోవైపు దివ్య భారతి మరణం వెనక దావూద్ ఇబ్రహీం డీ గ్యాంగ్ ఉంది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అంతే కాకుండా ఆమె భర్త సాజిత్ ముంబై పేలుళ్ల కేసు నుండి బయట పడేందుకు ఆమెను హత్య చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా సినిమాల్లో ఒక వెలుగు వెలగాల్సిన దివ్య భారతి అతి చిన్న వయసులోనే మనకు దూరం అయ్యింది.

ఇవి కూడా చదవండి: 

“అయోధ్య రామయ్య” గా మొదలైన బాలయ్య సినిమా”నరసింహనాయుడు” గా ఎలా మారిందో తెలుసా..!

Visitors Are Also Reading