Home » సీనియర్ ఎన్టీఆర్ ను అభినందిస్తూ దినపత్రికలో కృష్ణ ఇచ్చిన ప్రకటన ఏంటో మీకు తెలుసా..?

సీనియర్ ఎన్టీఆర్ ను అభినందిస్తూ దినపత్రికలో కృష్ణ ఇచ్చిన ప్రకటన ఏంటో మీకు తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ ఎన్టీఆర్ మరియు కృష్ణ సినిమాలు అంటే ఎంత పోటీ ఉండేదో అందరికీ తెలిసిన విషయమే. ఈ పోటీలో ఒక్కోక్కసారి కృష్ణ సినిమాలు పైచేయి సాధిస్తే, ఒక్కోక్కసారి ఎన్టీఆర్ సినిమాలు పైచేయి సాధించేవి. అయితే వీరిద్దరూ ఆ సమయంలో మంచి స్టార్ హీరోలుగా పేరు పొందారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి అయిన సందర్భంలో ఇచ్చినటువంటి పేపర్ ప్రకటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. ఆ సమయంలో కృష్ణ హీరోగా ఈనాడు సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది.ఈ మూవీ మలయాళంలో కూడా బ్లాక్ బస్టర్ హిట్ కాగా దీన్ని తెలుగులోకి రీమేక్ చేయడం గమనార్హం. మొదట ఈ సినిమాను ముత్యాల ముగ్గు శ్రీధర్ తో తీయాలని భావించారట.. సాంబశివరావును ఈ మూవీకి దర్శకుడిగా ఎంపిక చేసి, పరుచూరి బ్రదర్స్ ను మాటలు రాయడానికి కృష్ణ ఎంపిక చేశారు. అయితే ఈ మూవీలో కృష్ణ గారు నటిస్తే బాగుంటుందని పరుచూరి బ్రదర్స్ అన్నారట. ఆయన బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కృష్ణతో ఈ మూవీలో నటించేలా పరుచూరి బ్రదర్స్ చేశారు. ఈ సినిమా ఆయన 200 వ మూవీగా తెరకెక్కింది.సమాజం కోసం లైఫ్ నీ త్యాగం చేసినటువంటి పాత్రలో కృష్ణ నటించారు. 1982 డిసెంబర్ 17 వ తేదీన విడుదలైన టువంటి ఈ మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది. ఇందులో రండి కదలి రండి అంటూ సైకిల్ తొక్కుతూ పాడే పాట మాత్రం ఒక ఊపు ఊపేసింది. ఈనాడు మూవీ థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల తర్వాత తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి ఎన్టీఆర్ అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీని తర్వాత సీనియర్ ఎన్టీఆర్ ఎన్నికల్లో విజయం సాధించడాన్ని అభినందిస్తూ కృష్ణ పేపర్ లో ఇచ్చిన యాడ్ ప్రస్తుతం చాలా వైరల్ అవుతోంది.

Advertisement

ALSO READ;

Advertisement

ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!

అన్న ఎన్టీఆర్ సక్సెస్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు..?

 

Visitors Are Also Reading