Home » మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

మిథాలీ రాజ్ ఆస్తుల విలువ ఎంతో మీకు తెలుసా..?

by Anji
Ad

భార‌త మ‌హిళా క్రికెట్, టెస్ట్ జ‌ట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిన‌దే. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్న‌ట్టు ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌కట‌న చేసారు. అయితే 1999లో ఆరంగేట్రం చేసిన మిథాలీ 23 సంవ‌త్స‌రాల పాటు భార‌త్‌కు ప్రాతినిథ్యం వ‌హించింది. భార‌త్‌లో అత్య‌ధిక ఆదాయ అర్జిస్తోన్న క్రికెట‌ర్ గా గుర్తింపు పొందింది.


ఇక మిథాలీ రాజ్ నిక‌ర ఆస్తుల విలువ దాదాపు రూ.36.6 కోట్లు అని తెలుస్తోంది. క్రికెట్ ద్వారానే ఆమె ఎక్కువ ఆదాయ అర్జిస్తోంది. క్రికెట్ తో పాటు సోష‌ల్ మీడియా ప్ర‌క‌ట‌న‌లు, ఎండార్స్‌మెంట్ల ద్వారా కూడా ఆమెకు డ‌బ్బు బాగానే వ‌స్తోంది. మిథాలీ వ‌ద్ద ల‌గ్జ‌రీ కార్లు ఉన్నాయి. ఈ జాబితాలో రూ. 2.2 కోట్ల విలువైన 320-డీ బీఎండ‌బ్ల్యూ కారు కూడా ఉంది. రూ.35.49 ల‌క్ష‌లు విలువైన హోండా అకార్డ్‌, 8.49 ల‌క్ష‌ల విలువైన రెనాల్డ్ డ‌స్ట‌ర్ కూడా ఆమె గ్యారేజ్‌లో ఉన్నాయి. మ‌రొక‌వైపు Uber, Lever &woods, Ellen Solly American Tourister, Fast Up India బ్రాండ్‌ల ఉత్ప‌త్తుల‌కు ప్ర‌మోట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తోంది.

Advertisement

Advertisement

మిథాలీకి సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆమెకు ఇన్‌స్టాలో 1.5 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్లున్నారు. ఫేస్‌బుక్‌లో 4.5 మిలియ‌న్ల ఫాలోవ‌ర్లు ట్విట్ట‌ర్‌కు 873.7 వేల మంది ఫాలోవ‌ర్లు ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్ ఉన్నారు. సోష‌ల్ మీడియాలో ఎండార్స్‌మెంట్స్ ద్వారా ఆమె రూ.50ల‌క్ష‌లు మేర‌కు సంపాదిస్తుంది. ఇక నాలుగేళ్ల కింద‌ట కోచ్ ర‌మేష్ పొవార్‌తో జ‌రిగిన వివాదం భార‌న‌త క్రికెట్‌లో ప్ర‌కంప‌న‌లు రేపింది. అప్ప‌టివ‌ర‌కు కేవ‌లం ఆట‌తోనే వార్త‌ల్లో నిలిచిన మిథాలీ ఈ వ్య‌వ‌హారంతో వివాదాల్లో చిక్కుకున్న విష‌యం విధిత‌మే.

Also Read : 

ఆ శుద్ధ‌జ‌లం సేవిస్తే రోగాలు ద‌రిచేర‌వట‌.. ఆ ప్రాంతం ఎక్క‌డో తెలుసా..?

మృగ‌శిర‌కార్తె రోజు చేప‌ల‌ను ఎక్కువ‌గా ఎందుకు తింటారో మీకు తెలుసా..?

 

Visitors Are Also Reading