Home » శ్రీకాంత్, ఊహ లవ్ స్టోరీలో.. ఊహ కుటుంబానికి హీరో శ్రీకాంత్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..?

శ్రీకాంత్, ఊహ లవ్ స్టోరీలో.. ఊహ కుటుంబానికి హీరో శ్రీకాంత్ ఇచ్చిన ట్విస్ట్ ఇదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

హీరో శ్రీకాంత్ తనతో మొదటి నుంచి కలిసి నటించిన హీరోయిన్ ఊహ ను ప్రేమ వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ పెద్దకొడుకు రోషన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాలు కూడా తీశాడు. ఇక తన చిన్న కొడుకు ను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే తన కూతురు కూడా రుద్రమదేవి సినిమాలో నటించింది. ఇలా తన పిల్లలను కూడా ఇండస్ట్రీ లోకి తీసుకొస్తున్నారు శ్రీకాంత్.. కట్ చేస్తే శ్రీకాంత్ ఊహ ల ప్రేమ కథ ఎలా స్టార్ట్ అయింది.. ముందు ఎవరు ఎవరికి ప్రపోజ్ చేశారు మనం తెలుసుకుందాం..?

శ్రీకాంత్ ఊహ కలిసి చాలా చిత్రాల్లో చేశారు. ఆమె, కూతురు, ఆయన గారు సినిమాల్లో చేశారు. వీరిద్దరూ కలిసి చేసిన మొదటి చిత్రం ఆమె. ఈ చిత్రంతోనే ఊహ తెలుగు ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రమే వారి లవ్ స్టొరీ కి ఆజ్యం పోసిందట. ఈ చిత్రం ముహూర్తపు షాట్ లోనే వీరిద్దరూ ఒకరి నొకరు చూసుకున్నారు అని తెలుస్తోంది. అలా వారి పరిచయం ముందుగా స్నేహంగా మారి, తర్వాత వారి ఇద్దరి మనసులు కలిసి ఒకరినొకరు లవ్ చేసుకున్నారు. అంత ప్రేమ ఉన్న వీరు వారి లవ్ ని ఒకరితో ఒకరు పంచుకోలేదు. కానీ ఒకరోజు శ్రీకాంత్ రియల్ లైఫ్ లో కూడా హీరో లాగా ఊహ ఇంటికి వెళ్లి ప్రపోజ్ చేశారట.

Advertisement

Advertisement

 

వారి ప్రేమలో ఇది వారు మర్చిపోలేని సంఘటన అని చెబుతూ ఉంటారు. అలాగే శ్రీకాంత్ వాళ్ళ ఇంటికి వెళ్లి వారి తల్లిదండ్రులను మరియు ఊహను పిలిచి దేవుడి గదిలోకి వెళ్లి నేను ఊహ ను ప్రేమిస్తున్నాను అని చెప్పి తన మెడలోని బంగారు గొలుసును తీసి ఆమె మెడలో వేశారట. ఊహించని ఈ పరిణామానికి అందరూ సైలెంట్ అయిపోయారు. దీంతో వారంతా ఈయన ప్రేమని అర్థం చేసుకొని ఎలాంటి అభ్యంతరం చెప్పలేదట. ఆ తర్వాత జనవరి 20, 1997 లో ఈ ప్రేమికులు వివాహ జీవితానికి నాంది పలికారు.

also read:

Visitors Are Also Reading