Home » ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ.. ఒకేసారి ఇన్ని సినిమాలా..!!

ఓటీటీ ప్రేక్షకులకు పండగే పండగ.. ఒకేసారి ఇన్ని సినిమాలా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

మొన్నటివరకూ థియేటర్లలో రికార్డులు సృష్టించి, ఓటీటీ ప్లాట్ ఫామ్ లోకి వచ్చి మరోమారు సత్తా చుపించడానికి అనేక సినిమాలు ఒకేసారి వచ్చేసాయి. దీంతో ఓటిటి వరల్డ్ కు కొత్త సినిమాల కళ ఉట్టిపడుతుంది. ఇప్పటికే విరాటపర్వం, మేజర్ మూవీస్ నెటిజన్లను ఆకట్టుకున్నాయి. ఈ వారంలో ఇండియన్ మోస్ట్ అవైటెడ్, కమలహాసన్ కం బ్యాక్ సినిమా “విక్రం” కూడా ఓటీటీలో అడుగుపెట్టనుంది.

Advertisement

బాక్సాఫీస్ వద్ద నాలుగు వందల కోట్లకు పైగా షేర్ కొల్లగొట్టిన ఈ మూవీ 35 రోజుల తర్వాత ఓటిటీ వరల్డ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. జూలై 8 తేదీ నుంచి హాట్ స్టార్ తమిళం మరియు తెలుగుతో సహా ఇతర భాషల్లో స్ట్రీమ్ కానుంది. కమలహాసన్ మూవీతో పాటుగా నాని నటించి సక్సెస్ ఫుల్ గా దూసుకుపోయిన అంటే సుందరానికి మూవీ కూడా జులై పదవ తేదీ నుంచి నెట్ ఫ్లెక్స్ లో స్ట్రీమింగుకు రెడీ అవుతోంది. థియేటర్లలో విడుదలైన దాదాపు నెల రోజుల తర్వాత ఈ ఓటీటీలోకి వస్తున్నాడు నాని.

Advertisement

దీంతోపాటుగా సమ్మర్ సోగ్గాళ్లు కూడా ఓటీటీ లోకి వచ్చేస్తోంది. అలాగే అందరినీ థియేటర్లో కడుపుబ్బా నవ్వించిన f3, మూవీ కూడా జూలై మూడవ వారంలో సోని లివ్ లో స్ట్రీమింగ్ అవనుంది. దీంతోపాటుగా మోడరన్ లవ్ పేరుతో ఆంథాలజీ సిరీస్ ను అమెజాన్ ప్రైమ్ తీసుకొస్తోంది. హైదరాబాద్ నేపథ్యం ఉన్న ఆరు కథలను ఇందులో చూపించనున్నారు. ఇది కూడా జూలై 8 వ తేదీ నుండే ఈ అంథాలజీ ప్రైమ్ లో అందుబాటులోకి రానుంది.

also read:

Visitors Are Also Reading