Home » మీకు గుర‌క స‌మ‌స్య ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

మీకు గుర‌క స‌మ‌స్య ఉందా..? అయితే ఈ టిప్స్ పాటించండి..!

by Anji
Published: Last Updated on
Ad

ప్ర‌స్తుత కాలంలో చాలా మంది ప్ర‌జలు అనేక ర‌కాల ఆరోగ్య స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఊబ‌కాయం, స్థూల‌కాయ స‌మ‌స్య‌ల‌తో శ్వాస తీసుకోవ‌డంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. అందులో ప్రధాన‌మైంది గుర‌క‌. రాత్రి ప‌డుకున్న త‌రువాత చాలా మంది గుర‌క పెడుతుంటారు. గుర‌క వ‌చ్చే విష‌యం వారికి తెలియ‌దు. కానీ ప‌క్క‌న నిద్రించే వారికి న‌ర‌కంగా ఉంటుంది. వారి గుర‌క కార‌ణంగా ప‌క్క‌న వారికి నిద్ర క‌రువు అవుతుంది. ఈ స‌మ‌స్య వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌నుషుల‌ను బాధిస్తోంది. 30 ఏళ్ల లోపు వారిలో 10 శాతం 60 ఏళ్లు దాటిన వారిలో 60 శాతం మంది గుర‌క పెడుతుంటారు. నేష‌న‌ల్ స్లీప్ ఫౌండేష‌న్ గ‌ణాంకాల ప్ర‌కారం.. ప్ర‌తి ముగ్గురు పురుషుల్లో ఒక‌రికి, ప్ర‌తి న‌లుగురు స్త్రీల‌లో ఒక‌రికి రాత్రి గుర‌క పెట్టే అల‌వాటు ఉంది.


అప్పుడప్పుడూ గుర‌క పెడితే అది పెద్ద స‌మ‌స్య కాదు. కానీ ఎక్కువ కాలం గుర‌క పెట్టే వారిలో శ్వాస సంబంధిత హృద‌య సంబంధిత వ్యాధులు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుర‌క‌ను నిర్ల‌క్ష్యం చేయ‌కూడ‌ద‌ని సూచిస్తున్నారు. మ‌రి గుర‌క రాకుండా ఏం చేయాలి..? ఈ స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డ‌డానికి కొన్ని చిట్కాల‌ను సూచిస్తున్నారు నిపుణులు. ఆ టిక్కాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. అంత‌కంటే ముందు గుర‌క ఎందుకు వ‌స్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement


నిద్ర‌పోయే స‌మయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్ప‌డిన‌ప్పుడు గుర‌క వ‌స్తుంది. అదేవిధంగా ఈ స‌మ‌యంలో నోటి ద్వారా శ్వాస తీసుకుంటారు. ఆ మార్గంలోనూ అవాంత‌రాలుంటే అప్పుడు కుంచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండ‌డంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న క‌ణ‌జాలాలు క‌దలిక‌కు గురై చ‌ప్పుళ్లు వ‌స్తాయి. ఇది ఒక్క కార‌ణం మాత్ర‌మే. కానీ వాస్త‌వంలో మ‌రెన్నో అంశాలు ఉన్నాయి. ఇక ప్ర‌ధాన కార‌ణం మాన‌సిక ప‌ర‌మైన ఒత్తిడి, కంగారు, విప‌రీత‌మైన ఆలోచ‌న ధోర‌ణి, అధిక బ‌రువు. మ‌రి ఈ స‌మ‌స్య‌కు ఎలా చెక్ పెట్టాలో తెలుసుకుందాం.

అల్లం

అల్లంలో ఎన్నో పోష‌క విలువ‌లున్నాయి. అల్లంతో చేసిన పానియాలు తీసుకుంటే.. ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. క‌డుపునొప్పి, ద‌గ్గు, గుండె స‌మ‌స్య‌లు జ‌లుబు వంటి స‌మ‌స్య‌లు నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అల్లంలో యాంటిఇన్‌ప్ల‌మేట‌రీ, యాంటీ బాక్టీరియ‌ల్ ఏజెంట్స్ ఉంటాయి. ఇది గొంతును క్లియ‌ర్ చేస్తుంది. రోజుకు రెండు సార్లు అల్లం, తేనేతో టీ తాగితే ఫ‌లితం ఉంటుంది.

Advertisement

వెల్లుల్లి, ఉల్లిపాయ : 

వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగి తీసుకుంటే గుర‌క స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ముక్కు పొడిబార‌కుండా ర‌క్షిస్తాయి. ఇవి టాన్సిల్స్‌లో వాపును కూడా త‌గ్గిస్తాయి. స్లీప్ అప్నియాను నివారిస్తాయ‌ని ఓ అధ్య‌యనం పేర్కొన్న‌ది. ఒక‌వేళ మీకు వీటి వాస‌న ప్రాబ్ల‌మ్ లేక‌పోతే నిద్ర‌పోయే ముందు ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లింగి తింటే గుర‌క స‌మ‌స్య త‌గ్గుతుంది. లేదంటే.. రాత్రి భోజనంలో వెల్లుల్లి, ఉల్లిపాయ, ముల్లంగిని తింటే ఫ‌లితం ఉంటుంది. అర‌టిపండు, పైనాపిల్‌, క‌మ‌లాపండ్లు, ప్ర‌శాంత‌మైన నిద్ర గుర‌క స‌మ‌స్య‌ను త‌గ్గిస్తుంది. శ‌రీరంలో మెల‌టోనిన్ స‌రైన స్థాయిలో ఉత్ప‌త్తి అయితే నిద్ర ప‌డుతుంది. మెల‌టోనిన్ క‌లిగిన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. మెల‌టోనిన్ క‌లిగిన వాటిలో అర‌టిపండు, ఫైనాపిల్ ముఖ్య‌మైన‌వి. వీటిని తినడం ద్వారా గుర‌క స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.

సోయా పాలు : 

పాల ఉత్ప‌త్తుల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మ‌రింత హానీ త‌ల‌పెట్ట‌వ‌చ్చు. అందుకే ఆవు, గేదె పాలు, పాల ఉత్ప‌త్తుల బ‌దులు ప్రోటిన్స్ క‌లిగిన సోయా పాలు తీసుకోవ‌డం ఉత్త‌మం. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల గుర‌క స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

పుదీనా : 

పుదీనా నిద్ర‌లేమి స‌మ‌స్య‌ను, గుర‌క‌ను నివారించ‌డంలో అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. ముక్కుదిబ్బ‌డ జ‌లుబు గొంతు నొప్పి, ద‌గ్గు నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది. గోరు వెచ్చ‌ని నీళ్ల‌లో పుదీనా ఆకుల‌ను నాన‌బెట్టి తీసుకోవాలి. గుర‌క స‌మ‌స్య ముఖ్యంగా అధిక బ‌రువు ఉన్న వారిలో వ‌స్తుంది. లావుగా ఉండేవారి శ్వాస మార్గం నిద్ర స‌మ‌యంలో మ‌రింత కుంచించుకుపోతుంది. త‌ద్వారా గుర‌క స‌మ‌స్య తీవ్రం అవుతుంది. అందుకే గుర‌క స‌మ‌స్య‌తో బాధ‌ప‌డేవారు బ‌రువున్న‌ట్ట‌యితే బ‌రువు త‌గ్గ‌డానికి ప్ర‌య‌త్నించాలి.

Also Read : 

వాట్సాప్‌లో కొత్త ఫీచర్.. ఇకపై తప్పుడు సమాచారానికి చెక్..!

Minister Roja : నా భ‌ర్త మాట‌ల‌ను త‌ప్పుగా వ‌క్రీక‌రిస్తున్నారు

 

Visitors Are Also Reading