Telugu News » బ‌న్నిని శ్రీ‌దేవి కూతురు ఏమ‌న్న‌దో తెలుసా..?

బ‌న్నిని శ్రీ‌దేవి కూతురు ఏమ‌న్న‌దో తెలుసా..?

by Anji

అల్లుఅర్జున్ లాంటి యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ హీరోను చూస్తే ఎవ‌రైనా ప్లాట్ అవ్వాల్సిందే. ఆయ‌ను అభిమానులు కూడా బాగానే ఉన్నారు. ఈయ‌న డ్యాన్స్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ సంఖ్య‌లో అభిమానులు ఉన్నారు అని ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌స‌రం లేదు. బ‌న్ని డ్యాన్స్ వేస్తే.. విజిల్స్ మ్రోగాల్సిందే. డాన్స్ రాని వాళ్లు ఆయ‌న డ్యాన్స్ స్టెప్స్ చూస్తే డ్యాన్స్ ఇర‌గ‌దీయాల్సిందే.

Ads

Pushpa box office collection Day 23: Allu Arjun film creates new record - Movies News

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అల్లుఅర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17, 2021న విడుద‌లై ఆక‌ట్టుకుంటుంది. ముఖ్యంగా అల్లుఅర్జున్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది పుష్ప దిరైజ్‌. ఇక తాజాగా అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.

Allu Arjun Having This Disability In Pushpa?

ఈ సినిమాను చూసిన స్టార్ సెల‌బ్రిటీస్ త‌మ‌దైన స్టైల్‌లో బ‌న్నీ పొగ‌డ్త‌ల‌పై వ‌ర్షం కురిపిస్తున్నారు. తాజాగా  శ్రీ‌దేవి కూతురు జాహ్న‌వి క‌పూర్ ఈ సినిమా చూసింద‌ట‌. సినిమా చూసాక బ‌న్నీ గురించి త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ది క్యూలెస్ట్ ప‌ర్స‌న్ ఇన్ ది వ‌ర‌ల్డ్ అంటూ క్యాప్ష‌న్ ఇచ్చి.. మైండ్ బ్లోయింగ్ అన్న జిఫ్ ఇమేజ్‌ను పోస్టు చేసింది. పుష్ప సినిమా త‌న‌కు ఎంతో బాగా న‌చ్చింద‌ని చెప్పింది. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల చేసిన విష‌యం విధిత‌మే.


You may also like