Home » ఫేస్‌బుక్ లైవ్‌లో ఏడ్చేసిన శ్రీ‌రెడ్డి.. మెగా ఫ్యామిలీపై మ‌రోసారి ఫైర్‌..!

ఫేస్‌బుక్ లైవ్‌లో ఏడ్చేసిన శ్రీ‌రెడ్డి.. మెగా ఫ్యామిలీపై మ‌రోసారి ఫైర్‌..!

by Anji
Ad

న‌టి శ్రీ‌రెడ్డి గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఆమె ఏమి చేసినా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవ్వ‌డం ఖాయం. ఇది వ‌ర‌కే మెగా ఫ్యామిలీ పై ప‌లు సంద‌ర్భాల్లో విరుచుకుప‌డిన శ్రీ‌రెడ్డి తాజాగా మ‌రోసారి మెగా ఫ్యామిలీపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేసింది. క‌ర్మ ఎవ‌రినీ ఎప్పుడు వ‌దిలిపెట్ట‌ద‌ని.. నాగ‌బాబు, ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు ఏం జ‌రిగిందో ఇక అంద‌రికీ తెలుసు అని చెప్పింది. తాను చేస్తున్న ఉద్య‌మంలో ఓడిపోలేదు అని, తాను సాధించిన విజ‌యానికి నేడు ఫ‌లాలు ద‌క్కుతున్నాయ‌ని చెప్పుకొచ్చింది.


త‌మిళ‌నాడుకు వ‌చ్చి సొంతంగా త‌న‌కంటూ ఫ్యాన్ ఫాలోయింగ్‌, ఫ్రెండ్స్‌ను సంపాదించుకున్నాను వెల్ల‌డించింది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో పైకి రాకుండా త‌న‌ను తొక్కేసింద‌ని పేర్కొంది. క‌నీసం చిన్న అవ‌కాశం కూడా ఇవ్వ‌కుండా అడ్డుకున్నార‌ని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా టాలెంట్ ఉన్న వారిని చాలా వ‌ర‌కు తొక్కేస్తున్నారు. దేవుడ‌నే వాడు ఉన్నాడు. మెగా ఫ్యామిలీ నుంచి కేవ‌లం ఒక అల్లు అర్జున్ మాత్ర‌మే టాలెంట్‌తో పైకి వ‌చ్చాడు. టాలెంట్ లేని వారు పండిపోయిన ప్రూట్స్‌లాగా రాలిపోతున్నార‌ని పేర్కొన్నారు.

Advertisement

Advertisement

మీరు మాకు స‌పోర్ట్ చేయ‌క‌పోతే మేము బ‌త‌క‌లేమా..? సోష‌ల్ మీడియా కార‌ణంగా ఎంతో మంది బ‌తుకుతున్నారు. ప్ర‌స్తుతం మెగా ఫ్యామిలీని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. సినిమా ఇండ‌స్ట్రీని ఓ న‌లుగురు గుప్పిట్లో పెట్టుకుని ఆటాడిస్తున్నారు. ఎంతో మంది హీరోల‌ను తొక్కేశారు. క‌ర్మ ఎవ్వ‌రినీ వ‌ద‌ల‌దు. న‌న్ను బిగ్‌బాస్‌కు రాకుండా అడ్డుకున్నారు. నా మీద ప‌లు కేసులు పెట్టారు. న‌న్ను చాలా బాధ‌పెట్టారు. నేను ఎన్ని క‌న్నిటి బొట్లు రాల్చానో నాకే తెలుసు. నేను ఎవ్వ‌రినీ కూడా చేయి చాచి సాయంఅడ‌గ‌లేదు. నాకు నా ఫ్రెండ్స్ మాత్ర‌మే సాయం చేసారు. తాను కోలుకునే వ‌ర‌కు త‌న‌కు వారు అండ‌గా నిల‌బ‌డ్డారంటూ శ్రీ‌రెడ్డి చెప్పుకొచ్చింది.


ఈరోజు ఇవాళ ఇక్క‌డ నిల‌బ‌డ్డానంటే దానికి ఆ దేవుడి ఆశీస్సులే కార‌ణం అంటూ ఫేస్‌బుక్ లైవ్‌లో శ్రీ‌రెడ్డి క‌న్నీళ్లు పెట్టుకుంది. తాను, త‌న కుటుంబం ఎంత బాధ అనుభ‌వించామో త‌న‌కే తెలుసు అంది. ఇప్ప‌టికీ తాను అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్నాన‌ని వాపోయింది. గ‌త మూడేళ్లుగా యూట్యూబ్ లో వీడియోలు చేసుకుంటూ జీవితాన్ని నిల‌బెట్టుకున్నా. ఎంతో మంది న‌న్ను పెళ్లి చేసుకుంటామ‌ని వ‌చ్చినా ప్రేమిస్తున్నాన‌ని చెప్పినాఎవ్వ‌రినీ న‌మ్మ‌లేదు. న‌న్ను ఎవ్వ‌రైతే ఇబ్బంది పెట్టారో అంద‌రినీ క‌ర్మ వ‌దిలిపెట్ట‌దు. నాకు టాలెంట్ ఉంది. ఆనీ అవ‌కాశాలు రాకుండా చేశారంటూ శ్రీ‌రెడ్డి క‌న్నీళ్ల‌తో త‌న ఆవేద‌న‌ను వెల్ల‌డించింది.

Also Read : 

డాడి సినిమాలో చిరంజీవి కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి…!

ఆ ఒక్క కార‌ణంతోనే పెళ్లికి దూర‌మైన నాగార్జున హీరోయిన్ ..అదేంటంటే…?

 

Visitors Are Also Reading