Home » డాడి సినిమాలో చిరంజీవి కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి…!

డాడి సినిమాలో చిరంజీవి కూతురు గుర్తుందా..? ఇప్పుడు ఎంత అందంగా ఉందో చూడండి…!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్టులుగా నటించిన వాళ్లు ఇప్పుడు హీరో హీరోయిన్లుగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు చైల్డ్ ఆర్టిస్ట్ లు హీరో హీరోయిన్లుగా సక్సెస్ అయ్యారు కూడా. మ‌రి కొంద‌రు ముఖ్య‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు మరికొందరు చైల్డ్ ఆర్టిస్టులు కూడా రీ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. అలా రీ ఎంట్రీకి రెడీ అవుతున్న వాళ్లలో డాడీ సినిమాలో చిరంజీవి కూతురు ఐశ్వర్య పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ కూడా ఒకరు.

Advertisement

ఐశ్వర్య పాత్రలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు అనుష్క మల్హోత్రా…. ముంబై కి చెందిన ఈ అమ్మాయి డాడీ సినిమాతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. డాడీ సినిమా కోసం దర్శకుడు చాలామందిని ఆడిషన్స్ చేయగా ఆడిషన్స్ లో అనుష్క మల్హోత్రా తన నటనతో ఆకట్టుకుని ఛాన్స్ దక్కించుకుంది. 2002 సంవత్సరంలో మేరే యాద్ కీ షాది అనే బాలీవుడ్ సినిమాలో కూడా అనుష్క మ‌ల్హాత్రా నటించింది.

Advertisement

ఈ రెండు సినిమాల తర్వాత అనుష్క మల్హోత్రా సినిమాలకు పూర్తిగా దూరమైంది. ఆ తర్వాత చదువులపై దృష్టి పెట్టింది. ఇక ప్రస్తుతం అనుష్క మల్హోత్రా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మ‌డు కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తోంది. చూడ్డానికి ఎంతో అందంగా కనిపిస్తున్న అనుష్క మల్హోత్రా త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇప్పటికే ఓ కన్నడ సినిమాలో అనుష్క మల్హోత్రా నటిస్తున్నట్టు సమాచారం. అంతేకాకుండా హీరోయిన్ గా నటించేందుకు అనుష్క మల్హోత్రా డాన్స్ మరియు నటనలో కూడా శిక్షణ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక చిన్నప్పుడే డాడీ సినిమాతో ప్రేక్షకులకు దగ్గరైన అనుష్క మల్హోత్రా టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడు ఉంటుందో చూడాలి మ‌రి.

Also read : ప‌విత్ర లోకేష్ భ‌ర్త సుచేంద్ర‌ప్ర‌సాద్ బ్యాక్ గ్రౌండ్ గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading